Udaipur Files: ఉదయ్‌పూర్ ఫైల్స్ అనేది కన్హయ్య లాల్ హత్య కేసు గురించి తీసిన సినిమా. ఈ సినిమా ఈ రోజు విడుదైలంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు సినిమా విడుదలకు అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. కన్హయ్య లాల్ కుమారుడు సినిమా విడుదల గురించి మాట్లాడారు. తన తండ్రి హత్య జరిగి మూడేళ్లు గడిచినా,..నేరస్థులకు ఇంకా శిక్ష పడలేదని, ఈ సినిమా ద్వారా నిజాలు బయటకు వచ్చాయని చెప్పారు.
?utm_source=ig_web_copy_link
ఉదయపూర్‌లో 2022లో జరిగిన కన్హయ్య లాల్ హత్య ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో విజయ్ రాజ్, ప్రీతి ఝంగియాని తదితరులు నటించారు. అయితే.. ఈ సినిమాను థియేటర్ లో చూస్తూ కన్హయ్య లాల్ కుమారులు భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒక వీడియోలో కన్హయ్య లాల్ కుమారుడు తన తండ్రి ఫోటో ఫ్రేమ్‌తో కూర్చొని, సినిమా చూసిన తర్వాత కన్నీళ్లతో ఒక్కసారిగా ఏడ్చిన దృశ్యం అక్కడ చూపర్లను.. సోషల్ మీడియాలో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అలాగే, కన్హయ్య లాల్ మరో కుమారుడు యశ్ సాహు కూడా ఈ సినిమా చూసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
కన్హయ్య లాల్ ను 2022 జూన్ 28న ఉదయపూర్‌లో హత్య చేశారు. ఇద్దరు దుండగులు అతని దుకాణంలోకి ప్రవేశించి, ప్రవక్త మహమ్మద్‌పై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు గానూ కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దర్యాప్తు సంస్థలు ఈ హత్యను ఉగ్రవాద కుట్రతో ముడిపెట్టి.. చాలా మందిని అరెస్ట్ చేసింది.
ALSO READ: Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు
‘ఉదయపూర్ ఫైల్స్’ చిత్రం ఈ దారుణ ఘటనను చిత్రీకరిస్తూ, తీవ్రవాద భావజాలం నిర్దోషుల జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, సమాజంలో భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో వివరిస్తుంది. ఈ చిత్రం కేవలం నిజాన్ని బహిర్గతం చేయడమే కాక, ఉగ్రవాద మూలాలపై అవగాహన కల్పించడం, సమాజం ఏకమై నిలబడాల్సిన అవసరాన్ని గురించి క్లియర్ కట్ గా చెబుతుంది. భరత్ ఎస్. శ్రీనాథ్ దర్శకత్వంలో, అమిత్ జానీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో పాటు సామాజిక సందేశాన్ని అందిస్తుంది.
ALSO READ: NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్
యశ్ సాహు, ఈ చిత్రాన్ని చూడాలని ప్రజలను కోరాడు. ఇది కేవలం ఓ స్టోరీ కాదని, సమాజంలో జరిగిన నిజాన్ని తెలుసుకోవాలని అన్నారు. ‘ఈ చిత్రం ఏ మతాన్ని వ్యతిరేకించడానికి లేదా ఏ సముదాయ భావాలను గాయపరచడానికి కాదు. ఇది అవగాహన కల్పించడం, ఉగ్రవాదం గురించి జనాలకు తెలియాలనే లక్ష్యంగా పెట్టుకుంది’ అని అతను చెప్పాడు. ఇది కన్హయ్య లాల్ హత్య ద్వారా ఉదయపూర్‌లో జరిగిన విషాదాన్ని, దాని సామాజిక ప్రభావాన్ని సమర్థవంతంగా చిత్రీకరించి తీసిన సినిమా..