E-Paper

Kavya Maran: కావ్య బ‌రిలోకి దిగితే, శ‌త్రువు కూడా కాళ్ల ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే

Kavya Maran: కావ్య బ‌రిలోకి దిగితే, శ‌త్రువు కూడా కాళ్ల ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే
Advertisement

Kavya Maran:  ఇంగ్లాండ్ వేదికగా ది 100 లీగ్ టోర్నమెంట్ (the hundred 2026) అతి త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూలై 21వ తేదీన ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 20 రోజులకు పైగా కొనసాగనుంది. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. అయితే జులై 21వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. కావ్య పాపకు ( kavya maran) అదిరిపోయే శుభవార్త చెప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ది 100 లీగ్ టోర్నమెంట్ సందర్భంగా ఏరి కోరి కొనుగోలు చేసిన పాకిస్తాన్ మిస్టరీస్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కు (ABRAR AHMED ) NOC ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంటే ది 100 లీగ్ టోర్నమెంటులో సన్రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడన్నమాట. ఈ క్రమంలో కావ్య పాపకు బిగ్ రిలీఫ్ దక్కింది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

కావ్య బ‌రిలోకి దిగితే, శ‌త్రువు కూడా దిగిరావాల్సిందే

Advertisement

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ దేశం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. పాకిస్తాన్ మిస్టరీస్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ ఇద్దరు కూడా బరిలో ఉంటారు. అయితే వీళ్లకు తాజాగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మొదటగా ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆడబోడని.. ప్రచారం సాగింది. కానీ లేటెస్ట్ గా కావ్య పాప కోసం తన రూల్స్ మార్చుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి అబ్రార్ అహ్మద్ ను తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… కావ్య పాప జట్టుకు ఆడుకోమని పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

కావ్య పాప‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

ది హండ్రెడ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో 2.34 కోట్లు పెట్టి మరి పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు కావ్య పాప. ఈ క్రమంలో కావ్య పాపపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కావ్య పాప దేశద్రోహి అంటూ చాలామంది రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. పాకిస్తాన్ వాడికి ఎలా డబ్బులు ఇస్తావని ప్రశ్నించారు. కానీ ఇందులో ఎలాంటి తప్పిదం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. ఐపీఎల్ లో పాకిస్తాన్ క్రికెటర్లకు ఛాన్స్ లేదు కానీ.. విదేశీ లీగ్ లలో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే తప్పు లేదన్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

 

 

Related News

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

Big Stories

×