E-Paper
Advertisement

Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!

Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!
Advertisement

Pakistan : పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్‌లో ఇంగ్లాండ్‌ జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. హోటల్‌కు కిలోమీటర్‌ దూరంలో లోకల్‌ గ్యాంగ్స్‌ మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం.

పాక్‌ లో పర్యటించే ఇతర దేశాల క్రికెట్‌ జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్నారు. గతంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అనంతరం ఆ దేశంలో ఇతర దేశాల జట్లు పర్యటనకు వెళ్లడంలేదు. ఇటీవ పలు దేశాలు పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ముప్పు.. ఆ దేశంలో నిర్వహించే సిరీస్‌లపై ప్రభావం చూపించే అవకాశముంది. దీంతో విదేశీ ఆటగాళ్లకు పీసీబీ భారీ భద్రత కల్పిస్తోంది.

Advertisement

మరోవైపు వచ్చే ఏడాది పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌ లో భారత్‌ పాల్గొనడంపై చర్చ కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×