EPAPER

Gambhir’s net worth and salary: గంభీర్ ఎందుకంత డిమాండ్ చేస్తున్నాడు?.. తన ఆస్తులెంతో తెలుసా..?

Gambhir’s net worth and salary: గంభీర్ ఎందుకంత డిమాండ్ చేస్తున్నాడు?.. తన ఆస్తులెంతో తెలుసా..?

Gautam Gambhir’s net worth and salary: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా నియమితుడైన గౌతంగంభీర్ పై నెట్టింట రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తను జీతం కోసం చాలా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాడని, బీసీసీఐ అందుకే ఇంతకాలం ఆలోచించిందని వార్తలు వినిపించాయి. అయితే తన వేతనంపై గంభీర్ ఎందుకు అంత పట్టుబడుతున్నాడు.. గంభీర్ మరీ అంత పేదవాడా? అని కొందరు అడుగుతున్నారు.


బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. అంతకుముందు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఐపీఎల్ లో కోల్ కతా కెప్టెన్ గా ఆడాడు. అలాగే కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా పనిచేశాడు. అయితే రాజకీయాల్ సక్సెస్ అయి, అక్కడా పొసగలేక దానికి గుడ్ బై చెప్పేశాడు.

ఇవన్నీ చూస్తే క్రికెటర్ గా సక్సెస్ అయ్యాడు. కోల్ కతా, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కోచ్ గా, మెంటార్ గా సక్సెస్ అయ్యాడు. ఇంకేం కావాలి? తనకి అని అడుగుతున్నారు.


అన్నింటికి మించి కోల్ కతా మెంటార్ గా రూ. 25 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ కి 2022, 2023 సీజన్లలో మెంటార్ గా చేశాడు. వాళ్లు దాదాపు ఏడాదికి రూ. 3.5 కోట్ల చొప్పున ఇచ్చారని అంటారు. ఆ రెండు సార్లు లక్నో ప్లే ఆఫ్ కి వెళ్లింది. 2024లో బంపర్ ఆఫర్ తో కోల్‌కతాకి వచ్చాడు. మరిన్ని డబ్బులు సంపాధించాడు కదా..తన ఆస్తులు ఎంత అంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

గౌతం గంభీర్ ఆస్తుల విలువ నేడు రూ. 205 కోట్లుగా చెబుతున్నారు. మరింత ఆస్తిపరుడు అయి ఉండి బీసీసీఐ దగ్గర ఎందుకంత కక్కుర్తి ఎందుకు పడటం? అంత రచ్చ చేయడం? దేశం కోసం ఆడుతున్నానని చెప్పి, డబ్బుల కోసం గొడవ చేయడం, ముక్కుపిండి వసూలు చేయడం కరెక్టేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకు నెటిజన్లు చెబుతున్న సమాధానాలు విని అందరూ షాక్ అవుతున్నారు. అందరి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఇంతకీ ఏమిటా మాటంటే..

తను… ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ పేరుతో న్యూఢిల్లీలో ఒక ఛారిటీ సంస్థను నడుపుతున్నాడు. అక్కడ అనాథ పిల్లలను చేరదీస్తున్నాడు. అలాగే పేదపిల్లల ఆకలి తీరుస్తున్నాడు. యువతకు స్కిల్ డవలప్ మెంట్ కోర్సులు నేర్పిస్తున్నాడు. ఇంకా భగత్ సింగ్ జన లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేశాడు. అక్కడ కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉచితంగా డిజిటల్ లైబ్రరీ సేవలు అందిస్తున్నారు.

Also Read: టీ20ల్లో టీమిండియా మరో రికార్డు.. 150 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా..

కోవిడ్ సమయంలో ఎంతోమందిని ఆదుకున్నాడు. వారికి ఉచితంగా వ్యాక్సిన్లు, మందులు అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ లోకి వెళ్లి గౌతంగంభీర్ ఫౌండేషన్ అని టైప్ చేస్తే చాలు..తన కొండంత ఆశయం కనిపిస్తుంది. బహుశా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా చేసి, ఆ వచ్చే సొమ్ముతో ఫౌండేషన్ ని మరింత బలోపేతం చేయడానికి కావచ్చు, అందుకే తొందరపడి నోరు జారవద్దని చెబుతున్నారు. నిజమే కదా..

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×