IND vs UAE, Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 Tournament) భాగంగా ఇవాళ టీమిండియా తన తొలి మ్యాచ్ కు సిద్ధం అయింది. తొలి మ్యాచ్ లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో టీమిండియా ( India vs United Arab Emirates ) తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఈ టాస్ ప్రక్రియలో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… యూఏఈ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏ లో టీమిండియా, పాకిస్తాన్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు ఉన్నాయి. అటు గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి దూసుకువెల్లింది. ఇక ఇవాళ గ్రూప్ ఎలో భాగంగా టీమిండియా వర్సెస్ యునైటెడ్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. దుబాయిలో విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే రాత్రి 8 గంటలకు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ అలాగే సోనీ లీవ్ లలో మాత్రమే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ చూడవచ్చు. ఈసారి హాట్ స్టార్ లో ఏ ఒక్క మ్యాచ్ స్ట్రీమింగ్ కాలేకపోతోంది. ఇక టీమిండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ సంజు జట్టుకు దూరంగా ఉంటున్నాడని ప్రచారం చేశారు. కానీ చివరకు జట్టులోకి సంజూను తీసుకున్నారు.
Also Read: Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): ముహమ్మద్ వసీమ్(సి), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(w), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి