E-Paper
Advertisement

SKN: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బేబీ నిర్మాత.. పవన్ కళ్యాణ్ గెలవడంతో..

SKN: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బేబీ నిర్మాత.. పవన్ కళ్యాణ్ గెలవడంతో..
Advertisement

SKN: బేబీ సినిమా నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఆ తరువాత అల్లు అర్జున్ కు పీఆర్ గా పనిచేసి.. చిన్న చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ బేబీ సినిమాతో నిర్మాతగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. SKN..మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని. మెగా ఫ్యామిలీ గురించి ఎవరు తక్కువ మాట్లాడినా SKN అస్సలు వదలడు. ఇక పవన్ కళ్యాణ్ విజయం కోసం ఈ నిర్మాత కూడా కృషి చేశాడు. మరో నిర్మాత బన్నీ వాష్ తో కలిసి SKN.. పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియోను చూసి SKN ఒక మాట ఇచ్చాడు.

Advertisement

మరియమ్మ అనే  బామ్మ.. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తా అని చెప్పింది. ఇక ఆ వీడియోను షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ఈ అవ్వకు కొత్త ఆటో కొనిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. బామ్మ అన్నట్లుగానే పవన్ గెలిచాడు. ఇక ఇచ్చిన మాటను SKN సైతం నిలబెట్టుకున్నాడు. నేడు.. బామ్మ ఇంటికి వెళ్లి.. వారికి ఆటోను బహుమతిగా ఇవ్వడమే కాకుండా ఆటోలో ఆమెతో పాటు ప్రయాణించాడు.

” నేను చెప్పినట్లు చేసాను. మరియమ్మ గారి కుటుంబానికి మా నాయకుడి పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఆటోను బహుమతిగా ఇచ్చాను. వారి మనవడు దానిని నడిపి వారి కుటుంబాన్ని చూసుకుంటాడు. వారి సంతోషకరమైన కళ్లను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.. ఆయన ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎప్పుడూ గర్వపడేలా చేస్తారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. SKN చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×