T20 World Cup 2026 : ప్రస్తుతం ఆసియా కప్ 2025 జరుగుతోంది. ఇవాళ మరికొద్ది గంటల్లోనే భారత్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ జరుగునుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ ఉండనుంది. సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇది ముగిసిపోగానే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో కూడా తలపడనుంది. ఆ తరువాత వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ జరుగనుంది. అయితే భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 08 వరకు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కి అర్హత సాధిస్తే..కొలొంబోలో నిర్వహించనున్నారు. పాకిస్తాన్ కనుక అర్హత సాధించకపోతే అహ్మదాబాద్ లో ఫైనల్ జరిగే అవకాశం ఉంది.
Also Read : Prithvi Shaw : లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్…పృథ్వీషాకు రూ.100 ఫైన్
టీ 20 వరల్డ్ కప్ అప్పటి నుంచే
2026 పురుషుల టీ-20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 07 నుంచి మార్చి 08 మధ్య జరిగే అవకాశముంది. టీమిండియా వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. టీ-20 జట్లను కలిగి ఉంటాయి. భారత్ లో కనీసం ఐదు శ్రీలంకలో రెండు వేదికల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. అహ్మదాబాద్, కొలొంబోలో పాకిస్తాన్ ఆడుతోందా అనే దానిపై ఫైనల్ మ్యాచ్ ఆధారపడి జరుగుతుంది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో భారత్, పాకిస్తాన్ దేశాలు పరస్పరం ఆడుకోవడం లేదు. ప్రస్తుతం 2026 పురుషుల టీ-20 వరల్డ్ కప్ కోసం 15 జట్టు నిర్దారించబడ్డాయి. టీమిండియా, శ్రీలంక, అప్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ తొలిసారి ప్రపంచకప్ కి అర్హత సాధించాయి.
ఈ ఫార్మాట్ 2024 వెస్టిండీస్ USA లో జరిగే పురుషుల టీ-20 ప్రపంచ కప్ మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ 20 జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూపులోని మొదటి రెండు సూపర్ 8 రౌండ్ కి అర్హత సాధిస్తాయి. మరోసారి 8 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ సూపర్ 8 గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాలు సెమీ ఫైనల్ కి చేరుకున్నాయి. బార్బడోస్ లో జరిగిన ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించిన భారత్ ప్రస్తుత ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో 55 మ్యాచ్ లు జరిగాయి. తొలుత WPL మ్యాచ్ తరువాత.. పురుషుల టీ-20 వరల్డ్ కప్ జరుగనుంది.
🚨The ICC T20 World Cup 2026 is likely to be held in India from February 7 to March 8 🏆. #T20WorldCup2026 pic.twitter.com/cF2mZVoQ4W
— CricFollow (@CricFollow56) September 9, 2025