BigTV English

Lavanya Raj Tarun: పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తాను.. ఆయనే న్యాయం చేస్తారు

Lavanya Raj Tarun: పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తాను.. ఆయనే న్యాయం చేస్తారు

Lavanya Raj Tarun: ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పేరు ప్రస్తుతం మీడియాను షేక్ చేస్తుంది. లావణ్య అనే యువతిని ప్రేమించి, పెళ్ళాడి మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్.. తనను పెళ్లి చేసుకొని, కాపురం చేస్తూ.. కొత్త హీరోయిన్ మాల్వీతో ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు వదిలించుకుంటున్నాడని ఆరోపించింది.


ఇంకోపక్క రాజ్ తరుణ్.. ఆమెను ప్రేమించిన మాట వాస్తవమే కానీ, ఆమె డ్రగ్స్ తీసుకోవడం, వేరొక వ్యక్తితో కలిసి ఉండడంచేయడం వలన బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చాడు. అలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. రాజ్ తరుణ్ చేసిన ఆగడాలు అన్ని లావణ్య మీడియా ముందు ఏకరువు పెట్టింది. అబార్షన్ చేయించాడని, అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడని ఇలా చెప్పుకొస్తూనే ఉంది. రాజ్ తరుణ్.. లావణ్య తాగి మాట్లాడిన ఆడియోను రిలీజ్ చేసి ఆమె ఒక తాగుబోతు అన్నట్లు క్రియేట్ చేశాడు.

ఇక తాజాగా లావణ్య.. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తాను అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చాలా ఇష్టమని, ఆయనకు వీరాభిమానిని అని చెప్పిన లావణ్య.. రాజ్ తరుణ్ తనకు చేసిన అన్యాయాన్ని ఆయనకు వివరించి తనకు న్యాయం  చేయమని కోరతానని తెలిపింది.


అంతేకాకుండా పవన్ పెళ్లిలా గురించి కూడా మాట్లాడింది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. వదిలేసినా.. వారంటే గౌరవంగా ఉంటారని, పిల్లలను మంచిగా చూసుకుంటారని తెలిపింది. రాజ్ తరుణ్ తనను, పిల్లలను కూడా పట్టించుకోడని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుందా.. ? వెళ్తే ఆయన ఎలాంటి న్యాయం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×