IND vs PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో… కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. మరో నాలుగు రోజుల్లో.. అంటే ఈ నెల 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే కచ్చితంగా స్టేడియం హౌస్ ఫుల్ అవుతుంది. కానీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన జరగనున్న మ్యాచ్ కు మాత్రం ఊహించని షాక్ తగిలింది.
టీమిండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో దుబాయ్ స్టేడియం టికెట్లు పూర్తిగా సేల్ కాలేదు. సగానికి సగం.. టికెట్ల విక్రయాలు పడిపోయాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా… టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఆదివారం జరుగనుంది. సెప్టెంబర్ 14వ తేదీన జరుగనున్న ఈ మ్యాచ్ కు దుబాయ్ లోని అంతర్జాతీయ వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం… టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ లీవ్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో అన్ని భాషల్లో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ప్రసరాలు వస్తున్నాయి. సోనీ లీవ్ లో ఉచితంగా చూసే అవకాశం కల్పించారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని చాలామంది భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీసీసీఐ. ఇలాంటి తరుణంలో ఈ మ్యాచ్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. అందుకే టికెట్లు కూడా కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. అటు మ్యాచ్ ప్రసారమా జరిగినప్పుడు కూడా వ్యూయర్షిప్ తగ్గిపోయే… ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా…ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.
Also Read: Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
🚨 INDIA Vs PAKISTAN TICKETS STILL NOT SOLD OUT 🚨
– The tickets of India Vs Pakistan Match in this Asia Cup still not sold out. (TOI). pic.twitter.com/qsX3WTfBac
— Tanuj (@ImTanujSingh) September 10, 2025