Hardik Ex Wife Natasha : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే పాండ్యాతో విడాకుల తరువాత కొద్ది రోజులకే తన స్వదేశానికి బయలుదేరింది నటాషా స్టాంకోవిచ్. ఇక తన స్వదేశం సెర్బీయాలోనే తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని.. ఆగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా నటాషా స్టాంకోవిచ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
వీడియో తీయకుండా అడ్డుకున్న నటాషా
ఇటీవలే నటాషా.. తన కుమారుడు అగస్త్య తో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఓ లేడీ అగస్త్యను, నటాషాను వీడియో తీస్తుండగా.. ఆ వీడియో తీయకుండా నటాషా తోసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో నటాషా కి ఇంత బలుపా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు విడాకులు తీసుకున్న తరువాత నటాషా స్టాంకోవిచ్ మరో వ్యక్తితో కలిసి తిరుగుతోంది. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. అది చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు కూడా వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ప్రయత్నాల చేస్తున్నట్టు సమాచారం. తాను ఓ ఈవెంట్ కి వెళ్తూ.. హార్దిక్ పాండ్యా కొడుకును కూడా తీసుకెళ్లాడు.
పాండ్యా కి విరామం..
ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తరుచూ గాయాల బారిన పడటంతో టెస్టులు ఆడనని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతానని ఇప్పటికే హార్దిక్ బీసీసీకి స్పష్టం చేశాడు. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025లో టీమిండియా తరపున తిరిగి ఆడనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇది యూఏఈలో నిర్వహిస్తారు. ఇక బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో.. ఆసియా కప్ తరువాత అక్టోబర్ లోనే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. దీంతో ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన వరకు హార్దిక్ పాండ్యా కి విరామం దొరికినట్టు అయింది. పాండ్యా టీమిండియాలో కీలక ఆటగాడిగా రాణించడం విశేషం.
?igsh=OHloMDBmYzM0Zm1t