Billy Bowden : బ్రెంట్ ఫ్రేజర్ “బిల్లి” బౌడెన్ ఒక న్యూజిలాండ్ క్రికెట్ అంపైర్ మాజీ క్రికెటర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అతన్ని పదవీ విరమణ చేయాల్సి వచ్చే వరకు అతను ఆటగాడిగా ఉన్నాడు. అతను తన నాటకీయ సిగ్నలింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. ఇందులో ప్రసిద్ధ “వక్రవేలు ఆఫ్ డూమ్ ” అవుట్ సిగ్నల్ కూడా ఉంది. బిల్లీ బౌడెన్ తన ప్రత్యేకమైన అంపైరింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా అతని “క్రూకెడ్ ఫింగర్ ఆఫ్ డూమ్” అనే సిగ్నల్ కు బాగా పేరు పొందాడు. అతను మొదట్లో క్రికెట్ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా అంపైర్ గా మారాడు. బౌడెన్ అంపైరింగ్ శైలిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
Also Read : Watch Video: ఆ గుండె బతకాలి రా.. రనౌట్ కు ఛాన్స్ ఉన్నా కొట్టలేదు… వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే
క్రూకెడ్ ఫింగర్ ఆఫ్ డూమ్..
వాటిలో క్రూకెడ్ ఫింగర్ ఆఫ్ డూమ్.. ఔట్ అని చూపించడానికి అతను తన వంకర వేలిని ఉపయోగించే విధానమే క్రూకెడ్ ఫింగర్ ఆఫ్ డూమ్. ఈ విధానం చాలా ఫేమస్ అయింది. మరోవైపు ఔట్ అని చూపించడానికి చాలా నాటకీయ సిగ్నల్స్ ఇచ్చేవాడు. ఇక ఈ విధానం అభిమానులను ఆకర్షించేది. మైదానంలో అతను చాలా చమత్కారంగా ప్రవర్తించేవాడు. అతని చమత్కారంతో అభిమానులను నవ్విస్తోంది. బౌడెన్ తన అంపైరింగ్ కెరీర్‌లో అనేక మైలురాళ్లను సాధించాడు. 2016లో, అతను న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో తన 200వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో నిలిచాడు. బౌడెన్ అంపైరింగ్ శైలి అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అతను ఆటపై తనకున్న అభిరుచిని, తనదైన శైలిలో వ్యక్తపరిచాడు.
Also Read : Asia Cup 2025: పాకిస్థాన్ ను చావు దెబ్బ కొట్టేందుకు రంగంలోకి ఆర్మీ ఆఫీసర్… !
21 ఏళ్లలోనే..
కేవలం 21 సంవత్సరాల వయస్సులో అతనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది అతని మోచేతులు, ఎడమ మణికట్టు వేళ్లను ప్రభావితం చేసింది. అప్పటి నుండి అతను తన వేలును ఎన్నడూ సరిచేయలేడు. ఏది ఏమైనప్పటికీ ఇలా వంకరగా చూపించడం కూడా తనకు ఒక స్టైల్ గా మారింది. తన ఎంఫైరింగ్ తో ఎంతో అభిమానులను నవ్వించాడు. బాధపెట్టాడు. ఎందుకంటే..? ఏ ఎంపైర్ అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అది కేవలం కొన్ని సార్లు మాత్రమే. గతంలో టెక్నాలజీ తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగేవి. కానీ ప్రస్తుతం ఇలాంటి పొరపాట్లు జరగడానికే ఆస్కారం లేదు అనే చెప్పవచ్చు. ఇప్పుడూ రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంపైర్లతో ఈ మధ్య కాలంలో క్రీడాకారులు నిత్యం గొడవ పెట్టుకుంటున్నారు. అంపైర్లు కొందరూ వారికి అనుకూలంగా ఉన్న టీమ్ కి రివ్యూలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే టీమిండియా – ఇంగ్లాండ్ టూర్ లో అంపైర్ ఇంగ్లాండ్ కి అనుకూలంగా నిర్ణయం ఇవ్వడంతో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటిపై అంపైర్ల పై చర్యలు తీసుకోవాలని అటు క్రీడాకారులు, ఇటు అభిమానులు కూడా పేర్కొంటున్నారు.