E-Paper
Advertisement

IND VS SA : టీమిండియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మ్యాచ్ లు… టాస్ కోసం ప్రత్యేక నాణెం

IND VS SA : టీమిండియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మ్యాచ్ లు… టాస్ కోసం ప్రత్యేక నాణెం
Advertisement

IND VS SA : టీమిండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ‌ధ్య ఈనెల 14 నుంచి కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా తొలి టెస్ట్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ముఖ్యంగా న‌వంబ‌ర్ 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో, రెండో మ్యాచ్ న‌వంబ‌ర్ 22 నుంచి గువాహ‌టిలో జ‌రుగ‌నుంది. ఈ సిరిస్ లో టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్ర‌త్యేక బంగారు నాణెంను త‌యారు చేయించింది. ఇది గాంధీ-మండేలా ట్రోఫీ కావ‌డంతో.. ఈ గోల్డ్ కాయిన్ కి ఒక వైపు భార‌త జాతిపిత మ‌హాత్మ‌గాంధీ, మ‌రోవైపు జాతి వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన న‌ల్ల‌జాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలా చిత్రం ముద్రించారు. శాంతి, స్వేచ్ఛ‌, అహింస మార్గంలో న‌డిచిన ఈ మ‌హ‌నీయుల గౌర‌వార్థం ఈ స్పెష‌ల్ కాయిన్ రూపొందించారు.

Also Read : Shubman Gill: సారాను న‌మ్మించి మోసం చేసిన గిల్‌… టీమిండియా లేడీ ప్లేయర్ తో రొమాన్స్…!

సీరీస్ లో రెండు మ్యాచ్ లు

Advertisement

ఈ ప్ర‌త్యేక నాణెంను సిరీస్ లోని రెండు మ్యాచ్ ల్లో టాస్ సంద‌ర్భంగా ఉప‌యోగించ‌నున్న‌ట్టు క్యాబ్ అధ్య‌క్షుడు సౌర‌బ్ గంగూలీ తెలిపారు. 2015 నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే టెస్ట్ సిరీస్ ను మ‌హాత్మ‌గాంధీ నెల్స‌న్ మండేలా గౌర‌వార్థం ఫ్రీడ‌మ్ ట్రోఫీగా పిలుస్తున్న విష‌యం విధిత‌మే.అయితే దాదాపు ఆరేళ్ల‌ త‌రువాత ఈడెన్ గార్డెన్స్ లో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆస‌క్తి పెరిగింది. మొదటి మూడు రోజుల టికెట్లు దాదాపు అమ్ముడైన‌ట్టు క్యాబ్ ట్రెజ‌ర‌ర్ సంజ‌య్ దాస్ పేర్కొన్నాడు. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ ను త‌యారు చేయాల‌ని టీమిండియా మేనేజ్ మెంట్ కోర‌లేద‌ని క్యాబ్ అధ్య‌క్షుడు సౌర‌బ్ గంగూలీ వెల్ల‌డించాడు. మ‌రోవైపు పిచ్ ఇటు బ్యాట‌ర్ల‌కు, అటు బౌల‌ర్ల‌కు అనుకూలించేలా స‌మ‌తూక‌పు పిచ్ ఉంటుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్ర‌కోట స‌మీపంలో సోమ‌వారం భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఈడెన్ గార్డెన్స్ వ‌ద్ద ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కుల భ‌ద్ర‌త కోసం ప్ర‌త్యేకంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ప్రారంభ మ్యాచ్ ఎవ‌రిదో..?

ఇప్ప‌టికే సౌతాఫ్రికా తొలిసారిగా టెస్ట్ ఛాంపియ‌న్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. టీమిండియా కూడా మ‌రోసారి టెస్ట్ ఛాంపియ‌న్స్ గా నిల‌వాల‌ని భావిస్తుంటే.. ఆస్ట్రేలియా జ‌ట్టు టాప్ లో కొన‌సాగుతోంది. సౌతాఫ్రికా జ‌ట్టు కూడా మంచి ఫామ్ లో ఉండ‌టంతో టీమిండియా గెల‌వ‌డం అంత సులువు కాద‌ని క్రీడా విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా జ‌ట్టును సైతం సౌతాఫ్రికా జ‌ట్టు ఓడించ‌డం విశేషం. మ‌రీ టీమిండియా లో టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా గెల‌వ‌డం అంత సులువు కాదు. ఎందుకంటే ఇండియా పిచ్ ల్లో దాదాపు భార‌తదేశ‌మే ఎక్కువ‌గా గెలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. సొంత గ్రౌండ్ లో వారికి మంచి ప‌ట్టు ఉంటుంది. టీమిండియా ఆట‌గాళ్లు కూడా మంచి ఫామ్ కొన‌సాగిస్తున్నారు. సౌతాఫ్రికా ను కూడా అంత తేలిక‌గా తీసివేయ‌లేము. న‌వంబ‌ర్ 14 న జ‌రిగే మ్యాచ్ లో ఏ జ‌ట్టు గెలుస్తుందో వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Also Read : Sourav Ganguly : గంభీర్ పెద్ద‌ మెంటలోడు…ష‌మీని అన్ని ఫార్మాట్లలో ఆడించాల్సిందే

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×