BigTV English

ipl 2023 commentary in Bhojpuri :  ఐపీఎల్ భోజ్‌పురి కామెంటరీకి సూపర్ హిట్ టాక్.. చెప్పేది మన రేసుగుర్రం మద్దాల శివారెడ్డి

ipl 2023 commentary in Bhojpuri :  ఐపీఎల్ భోజ్‌పురి కామెంటరీకి సూపర్ హిట్ టాక్.. చెప్పేది మన రేసుగుర్రం మద్దాల శివారెడ్డి
ipl 2023 commentary in Bhojpuri

ipl 2023 commentary in Bhojpuri : క్రికెట్ కామెంటరీ అంటే ఇంగ్లీషే. చాలా క్లాస్‌గా, అప్పుడప్పుడు వచ్చే హైపిచ్ వాయిస్‌. మనం అలా అలవాటు పడిపోయాం. టీవీకి దూరంగా ఉన్నా సరే.. ఆ హైపిచ్ వాయిస్ విని ఫోర్, సిక్స్ లేదా ఔట్ అయ్యుంటాడని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లం. అదే వేరే లాంగ్వేజ్ అయితే… ప్రతీదీ హైపిచ్ వాయిసే. అందుకే, ఆ కామెంటరీ వినాలంటే కొందరికి విసుగు. అర్ధమైనా, కాకపోయినా ఇంగ్లీష్ కామెంటరీనే వింటుంటారు చాలా మంది. అఫ్‌కోర్స్.. అందుబాటులో ఉండడంతో తెలుగు లాంటి ఇతర భాషలను కూడా ఆదరిస్తున్నారనుకోండి.


కాని, క్రికెట్ కామెంటరీ అంటే ఇలా ఉంటుందా అని అనిపిస్తున్నది మాత్రం భోజ్‌పురినే. మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా భోజ్‌పురి భాషలో చెప్పే కామెంటరీకి మాత్రం రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఎంతలా అంటే… విరాట్ కొహ్లీ కూడా నవ్వు ఆపుకోలేనంత. భోజ్‌పురి యాసతో మాట్లాడుతున్న ఐపీఎల్ కామెంటరీని స్యయంగా చూసి తెగ నవ్వుకున్నాడు కొహ్లీ. ఆ వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ కామెంటరీ ఎవరు చెబుతున్నారో తెలుసా. రేసుగుర్రం మద్దాల శివారెడ్డి. బీజేపీ ఎంపీ అయిన ఈ భోజ్‌పురి నటుడు రవికిషన్ ఐపీఎల్ కోసం కామెంటరీ చెబుతున్నారు. మిగతా భాషలతో పోల్చుకుంటే భోజ్‌పురి స్ట్రీమింగ్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. మహ్మద్ సైఫ్, సత్య ప్రకాశ్, స్థానిక క్రికెటర్లు అద్భుతంగా కామెంటరీ చేస్తున్నప్పటికీ భోజ్‌పురినే హైలెట్.


జియో సినిమాలో ప్రసారం అవుతున్న ఐపీఎల్‌ను.. ప్రాంతీయ భాషల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది రిలయన్స్. రోజుకు కోట్ల మంది జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్‌ చూస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, భోజ్‌పురి భాషల్లో ప్రజలకు చేరువయ్యేందుకు జియో సినిమా ప్రయత్నిస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×