IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ ఫైనల్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో హిట్ వికెట్ (Sai Sudharsan Hit-Wicket) కాకుండా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ప్లాన్ వేశాడు. దాదాపు రెండు గంటల పాటు దీనిపై కసరత్తులు చేసి, వ్యూహాన్ని రచించాడు. బ్యాట్ కు తెగ స్ప్రే కొట్టి.. సిద్ధమయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సాయి సుదర్శన్ అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ కోసం సాయి సుదర్శన్ కూడా పోటీ పడుతున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్ లో భాగంగా మొన్న జరిగిన క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో సాయి సుదర్శన్ స్క్వేర్ వికెట్ ఆడుతూ హిట్ వికెట్ అయ్యాడు. బౌండరీ సాధించినప్పటికీ తన చేతిలో నుంచి బ్యాట్, స్లిప్ అయి వికెట్ల పైన పడింది.
అచ్చం అలాగే మొన్న జరిగిన క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా కూడా హిట్ వికెట్ అయ్యాడు. ఇలా రెండుసార్లు సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావడంపై గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవాళ ఫైనల్స్ లో కూడా సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇందులో మళ్లీ హిట్ వికెట్ కాకుండా, సాయి సుదర్శన్ అదిరిపోయే ప్లాన్ వేశాడు. తన బ్యాట్ కు విపరీతంగా స్ప్రే కొట్టి ప్రాక్టీస్ చేశాడు. ఇది వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా కూడా బ్యాట్ కు విపరీతమైన స్ప్రే కొట్టి బరిలోకి దిగనున్నాడు. అయితే బ్యాట్ కు స్ప్రే (Spray) కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ నేపథ్యంలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారీ వర్షం పడితే 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. లేదా సూపర్ ఓవర్ అయినా నిర్వహిస్తారు. ఇవాళ మ్యాచ్ నిర్వహించలేకపోతే, రిజర్వుడే కూడా ఉంటుంది. అంటే రేపు కూడా మ్యాచ్ జరగనుంది.
Someone explain this to me: What's the purpose of this spray? 😥
Sai Sudharsan applied this spray to his bat before the GT vs RR match, but his bat still slipped and hit the stumps again. 😭😄 pic.twitter.com/8IsBzr7MUw
— Jara (@JARA_Memer) May 30, 2026
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==