IPL – BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) కంటే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఏడాదికి రెండు సీజన్లు నిర్వహించేలా సన్నద్ధమవుతోందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో, మార్చిలో ఒక సీజన్ అలాగే ఏడాది చివరలో మరో సీజన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు తాజాగా బీసీసీఐకి సంబంధించిన అధికారి అమితాబ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి రెండు ఐపీఎల్ సీజన్లు నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తోందని ఆయన వెల్లడించారు.
Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్…రిజ్వాన్ కు జరిగిన అవమానమే ఆయుషి సోనికి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కి ( Board of Control for Cricket in India ) సంబంధించిన అధికారి అమితాబ్ ధుమాల్ సంచలన ప్రకటన చేశారు. ఏడాదికి రెండు ఐపిఎల్ టోర్నమెంట్ నిర్వహించేలా సన్నద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. మార్చి నుంచి మే వరకు ఒక సీజన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య మినీ ఐపీఎల్ నిర్వహించేలా బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు అమితాబ్ ధుమాల్ వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ ఏడాది ఎలాంటి ఐసీసీ టోర్నమెంట్లు లేవు.
మిగతా విదేశీ క్రికెట్ జట్లు కూడా ఎలాంటి ఐసీసీ ( ICC) టోర్నమెంట్లు ఆడడం లేవట. అందుకే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మినీ ఐపీఎల్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అలా ప్రతి ఏడాది ఐసీసీ టోర్నమెంట్లు లేని సమయంలో మినీ ఐపీఎల్ నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే మినీ ఐపీఎల్ నిర్వహిస్తే ప్రతిరోజు రెండు మ్యాచ్ లు అంటే డబుల్ హెడర్ ఉంటాయని కూడా తెలిపారు. అలా అయితేనే త్వరగా షెడ్యూల్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలిపారు అమితాబ్ ధుమాల్ ( Amitabh Dhumal ).
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026 ) ముహుర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జరుగనుంది. దాదాపు 84 మ్యాచ్ లు జరుగనున్నట్లు సమాచారం.
IPL MIGHT SEE SPLIT WINDOW 🚨
Amitabh Dhumal said : “We are mulling a split window to make that possible – otherwise you will have to host too many double headers. However, it’s still a work in progress and our plan is if we can find a window around September-October before the… pic.twitter.com/Es7SlJdmoH
— Vipin Tiwari (@Vipintiwari952) January 13, 2026