E-Paper
Advertisement

ipl Bowler : ఆఖరి ఓవర్లో గెలుపును అడ్డుకున్న బౌలర్లు వీళ్లే..

ipl Bowler :  ఆఖరి ఓవర్లో గెలుపును అడ్డుకున్న బౌలర్లు వీళ్లే..
Advertisement
ipl Bowler

ipl Bowler : అయిపోయింది.. ఇక మ్యాచ్ ఓడిపోయినట్టే. ఈజీగా కొట్టేస్తారు. ఇలాంటి సందర్భాలు చాలానే చూసి ఉంటాం. కాని, అప్పుడే ఒకరొస్తారు. బాల్‌తో మ్యాజిక్ చేస్తారు. ఎదురుగా బ్యాట్‌తో సమాధానం చెప్పగలిగే ఆటగాడు ఉన్నా, మ్యాచ్‌ను తమ వైపు తిప్పగలిగే మేటి బ్యాట్స్ మెన్ ఉన్నా.. ఆ టైంకి వారి పప్పులేం ఉడకవు. అలాంటి బౌలర్స్ వాళ్లు.

1. మాతీషా పతిరాణా – చెన్నై సూపర్ కింగ్స్
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ 20 ఏళ్ల కుర్రాడు అద్భుతమే చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ అంటే ఎవరికైనా కష్టమే. పైగా ఫస్ట్ హాఫ్‌లో బౌలింగ్ వేసి 28 పరుగులు ఇచ్చిన బౌలర్‌ను నమ్మి డెత్ ఓవర్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్. 18వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి బెంగళూరు జట్టును డిఫెన్స్ లోకి నెట్టాడు. ఇక ఆఖరి ఓవర్లో 19 రన్స్ చేస్తే చాలు.. బెంగళూరు గెలిచేది ఆ మ్యాచ్‌లో.  ఆ సమయంలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి చెన్నై ఖాతాలో విక్టరీని పడేశాడు.

Advertisement

2. శామ్ కరన్  – పంజాబ్ కింగ్స్
డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయడంతో కరన్ కు మంచి అనుభవం ఉంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అనుభవం బాగా పనికొచ్చింది. ఓవైపు హెట్ మేయర్, ధ్రువ్ ఉన్నారు. రాజస్తాన్ కొట్టాల్సింది 16 పరుగులే. ఫైనల్ ఓవర్ కరన్ కు అప్పగించారు. లాస్ట్ బాల్‌కు బౌండరీ సహా మొత్తం 10 పరుగులే ఇచ్చాడు కరన్. ఇంకేముందు పంజాబ్ కింగ్స్ కు రెండో విజయం వచ్చి చేరింది.

3. ఉమ్రాన్ మాలిక్ – సన్ రైజర్స్ హైదరాబాద్
కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన ఫస్ట్ ఓవర్లోనే 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. కాని, ఫైనల్ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ కే బౌలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం 32 పరుగులు చేస్తే చాలు.. ఆ మ్యాచ్‌లో కోల్ కతా గెలుస్తుంది. అప్పటికే 28 పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. కాని, అద్భుతం జరిగింది. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫైనల్లీ, సన్ రైజర్స్ కు విజయం దక్కింది. 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×