BigTV English

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ చేసిన తప్పేమిటి?

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ చేసిన తప్పేమిటి?
mohammed siraj latest news

mohammed siraj latest news(cricket news today telugu)


టీమ్ మేనేజ్మెంట్‌కి మహ్మద్ సిరాజ్‌పై అపారమైన నమ్మకం ఉంది. అందుకే బెంచ్‌పై కాకుండా ఆఖరి 11మందిలో ఒకడిగా ఉంటున్నాడు. కానీ గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత తన పని, ఫీల్డింగ్ చేయడం తప్ప మరొకటి కనిపించడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌కి ,  రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రోపర్‌గా బౌలింగ్ ఇవ్వలేదనే విమర్శలు వినిపించాయి.

సౌతాఫ్రికాలో జరిగిన రెండు టెస్టుల్లో మొదటి టెస్ట్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 9 ఓవర్లు వేసి, కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసుకున్నాడు.


హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లే వేశాడు. అయితే 28 పరుగులు సమర్పించుకోవడంతో మళ్లీ సిరాజ్ జోలికి రోహిత్ వెళ్లలేదు. ఒక బ్యాటర్ గస్టాండ్ అయిపోయినప్పుడు, అతన్ని అవుట్ చేయడానికి ప్రతి కెప్టెన్ కూడా జట్టులో ఉన్న వనరులన్నీ ఉపయోగిస్తాడు. నిజానికి ఒలిపోప్ ఫస్ట్ డౌన్ వచ్చాడు. తను స్టాండ్ అవుతున్నప్పుడు నలుగురు బౌలర్లని ప్రయోగించాడు కానీ, ఉన్న ఐదో బౌలర్‌ని ఉపయోగించకపోవడం కెప్టెన్సీ వైఫల్యమని అంటున్నారు.

మరెందుకు సిరాజ్‌ని కెప్టెన్ పక్కన పెడుతున్నాడనేది అంతు పట్టకుండా ఉందని అంటున్నారు. టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు బ్రేక్స్ ఉంటాయి. అప్పుడు టీమ్ మేనేజ్మెంట్‌తో కలిసి వ్యూహ రచన చేసుకునే వెసులు బాటు ఉంటుంది. మరి ద్రావిడ్ అయినా, రోహిత్‌కి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

అంత స్పిన్ తిరిగే పిచ్ మీద బుమ్రాతో అదే పనిగా బౌలింగ్ చేయించిన రోహిత్ ఇలా సిరాజ్ పట్ల చిన్నచూపు చూడటం సరికాదనే విమర్శలు నెట్టింట తీవ్రంగా వినిపిస్తున్నాయి. బహుశా ఈ ఒత్తిడి తట్టుకోలేక సెకండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్‌కి బౌలింగ్ ఇచ్చాడు. ఈసారి వికెట్ అయితే రాలేదుగానీ,  7 ఓవర్లు వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్పిన్నర్లతో పోల్చుకుంటే తక్కువ ఎకానమీతోనే చేశాడు.

ఇక్కడ సిరాజ్‌కి వికెట్లు పడవని కెప్టెన్ భావిస్తున్నప్పుడు, టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు సిరాజ్‌పై నమ్మకం పెడుతోందని నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×