Ishan Kishan blames Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026) కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు వన్డేలు పూర్తికాగా, రేపు మూడవ వన్డే ఎదురుగానుంది. ఈ టోర్నమెంట్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా, సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ నెల 17వ తేదీన లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో టీమిండియా ఏకంగా 170 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) 125 పరుగులతో రెచ్చిపోయాడు. అటు గిల్ (Shubman Gill ) 154 పరుగులు చేశాడు. అయితే ఇందులో ఇద్దరు కూడా డబుల్ సెంచరీ చేసుకునే అవకాశం వచ్చింది. కానీ ఇద్దరు మిస్ చేసుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య రెండో వన్డే సందర్భంగా డబుల్ సెంచరీ చేసుకోకుండా తొందరగా ఔట్ కావడంపై ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనంతటి వెనుక గిల్ కుట్ర ఉందంటూ బాంబు పేల్చారు. 125 పరుగుల వద్ద అవుట్ అయ్యేలా గిల్ రెచ్చగొట్టాడని, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇషాన్ కిషన్. సెంచరీ చేసిన తర్వాత సిక్సర్లు బాగా కొట్టు అంటూ.. గిల్ (Shubman Gill ) తనను రెచ్చగొట్టినట్లు షాకింగ్ విషయాలను పంచుకున్నాడు ఇషాన్ కిషన్. దాంతో ఓవర్ లో వరుసగా రెండు సిక్సులు కొట్టిన తాను… మరో సిక్సర్ కోసం ట్రై చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యానని ఎమోషనల్ అయ్యారు.
గిల్ రెచ్చగొట్టి ఉండకపోతే, డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడిని అంటూ వ్యాఖ్యానించారు. ఈ కుట్ర వెనుక గిల్ ఉన్నాడని బాంబు పేల్చారు. దీంతో ఇషాన్ కిషన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే గిల్ పై డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా ఇషాన్ కిషన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇది విన్న క్రికెట్ ఫ్యాన్స్…. సరదాగా లేదా సీరియస్ గా చెప్పినా గిల్ క్యారెక్టర్ అదేనని చురకలు అంటిస్తున్నారు. నిజంగా గిల్ సెల్ఫీస్ అని వ్యాఖ్యానిస్తున్నారు. తనకంటే ఎక్కువగా ఇషాన్ కిషన్ కు పేరు ప్రఖ్యాతలు వస్తాయని, ఇలా రెచ్చగొట్టి ఉంటాడని సెటైర్లు పేల్చుతున్నారు ఫ్యాన్స్.