E-Paper
Advertisement

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్
Advertisement

Weather News: వాతావరణంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  సాయంత్రం వరకు ఏకధాటిగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. ఆ తర్వాత వానలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణలో మూడు రోజులు భానుడి ప్రతాపం.. ఆ తర్వాత వానలు

Advertisement

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల్లో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే నైరుతి రుతుపవనాల ప్రభావం నెమ్మదిగా కదులుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వర్షాలు ఆలస్యం పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వర్షపాత లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

ఎండలతో అల్లాడిపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలియజేసింది.

Advertisement

మరో మూడు రోజులు ఉక్కపోత ప్రజలకు తప్పదు-ఐఎండీ అంచనా

ఆయా ప్రాంతాల్లో పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే బుధ లేదా గురువారం నుంచి వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో రుతుపవనాలు నెమ్మదగా కదులుతున్నాయి. నేటి నుంచి జూన్ 23 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఎండల తీవ్రత కంటిన్యూ కానుంది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో పగటి వేళ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదు కావచ్చని తెలుస్తోంది. హైదరాబాద్‌లో 37 నుంచి 39 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపింది.

ALSO READ: హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, నాగర్‌ కర్నూల్, వికారాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

Related News

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

ప్రభుత్వ జీతం.. సొంత వ్యాపారం.. టీచర్ల భాగోతంపై ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్!

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

Big Stories

Advertisement
×