Kamran Akmal: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Women’s T20 World Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు 11 మ్యాచులు జరిగాయి. నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మహిళల (South Africa Women vs Pakistan Women) జట్ల మధ్య ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా విజయం సాధించగా, వరుసగా రెండో ఓటమి చవిచూసింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ ఓటమితో పాకిస్తాన్ మహిళల జట్టు ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు. గ్రూప్ స్టేజ్ లోనే కట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన పై కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురుషుల పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజం (Babar Azam), మహిళల జట్టులో గుల్ ఫిరోజా (Gull Feroza) ఇద్దరు దరిద్రులులేనని, వీళ్లు ఉన్నన్ని రోజులు ఓడిపోవడమే అంటూ బాంబు పేల్చారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్. మొదటి మ్యాచ్ లో టీమిండియా చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్, నిన్న దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిపోయింది. ఫాతిమా సనా గట్టిగా పోరాటం చేసినప్పటికీ.. మిగిలిన ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మహిళల జట్టు ఓపెనర్ గుల్ ఫిరోజా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కమ్రాన్ అక్మల్.
అసలు ఆమెను టీ20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని మండిపడ్డారు. బాబర్ ఆజం తరహా లోనే గుల్ ఫిరోజా ఓవరాక్షన్ తప్ప, ఆడిందేమీ లేదని విమర్శలు చేశారు. ఈ ఇద్దరు పాకిస్తాన్ జట్టులో ఉన్నన్ని రోజులు.. గెలవడం కష్టమేనని ఉండబద్దలు కొట్టి చెప్పారు. ఎన్నో సెంచరీలు చేసినట్లుగా ఇద్దరు క్రికెటర్లు ఫీల్ అవుతారని, ఇలాంటి వారి వల్ల వర్కౌట్ కాదని బాంబు పేల్చారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా నిన్న దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా తొమ్మిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ మహిళల జట్టు 126 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో చేదించింది దక్షిణాఫ్రికా మహిళల జట్టు.