Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య రసవత్తర పోరు జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో ఈసారి రాణించిన హైదరాబాద్, ఎట్టకేలకు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కావ్య పాప చేసిన ఓ పని విభాగంగా మారింది. వైభవ్ సూర్య వంశీని ( Vaibhav Suryavanshi) ఉద్దేశించి, కావ్య పాప బండ బూతులు తిట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణిస్తాడనుకుంటే, డకౌట్ అయ్యాడు. ప్రఫుల్ హింజే బౌలింగ్ లో కీపర్ సలీల్ అరోరాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఈ క్యాచ్ పైకి లేవగానే, కావ్య పాప బండ బూతులు తిట్టినట్లు వీడియో బయటకు వచ్చింది. నోటితో చెప్పరాని బూతు వాడారు. అయితే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కావ్య పాప తిట్టినట్లు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న కావ్య పాప, ఇప్పుడు 15 ఏళ్ల బుడ్డోడిని తిట్టి అడ్డంగా దొరికిపోయింది. వైభవ్ సూర్య వంశీని తిట్టినందుకుగాను కావ్య పాపపై ( SRH Kavya Maran) చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
వైభవ్ నీ పని అయిపోయింది.. ఇక స్కూల్ కు వెళ్ళిపో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో మొన్నటి వరకు వైభవ్ సూర్య వంశీ పేరు మారు మోగింది. అయితే ఈ సౌండ్ మొత్తం హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింజే ( Praful Hinge) తగ్గించేశాడు. తన అద్భుతమైన బంతికి వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Suryavanshi ) డకౌట్ చేశాడు ప్రఫుల్ హింజే. వైభవ్ సూర్యవంశీ డకౌట్ కావడం.. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అందరితో ఒక లెక్క.. హైదరాబాద్ తో ( SRH) మరో లెక్క అంటూ కౌంటర్లు పేల్చుతున్నారు. ఇక 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఆటలు సాగబోవని… స్కూలుకు వెళ్లడం బెటర్ అంటూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. సినిమా డైలాగులతో ర్యాగింగ్ చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
The reaction of Kavya Maran when Vaibhav's shot was in the air is pure gold.#SRHvsRR pic.twitter.com/CirPa7BF0I
— Saurabh Mishra (@FlautistSaurabh) April 13, 2026