E-Paper
Advertisement

Team India: టీమిండియా మ‌హిళ‌ల‌కు రూ.1000ల‌ జీతమేనా..దిగ‌జారిన బీసీసీఐ ?

Team India: టీమిండియా మ‌హిళ‌ల‌కు రూ.1000ల‌ జీతమేనా..దిగ‌జారిన బీసీసీఐ ?
Advertisement

Team India:  వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచింది. ఎన్నో ఇళ్ల కలను మొన్న ఆదివారం రోజున నెరవేర్చారు టీమిండియా మహిళ క్రికెటర్లు. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టును ఫైనల్ బరిలో ఓడించిన టీమిండియా తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే మహిళల టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో మిథాలి రాజ్ ( Mithali Raj) సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సమయంలో టీమిండియా మహిళలకు నెలకు 1000 రూపాయల ఫీజు మాత్రమే ఇచ్చేవారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Amol Muzumdar: ఒక్క మ్యాచ్ టీమిండియాకు ఆడ‌లేదు.. కానీ వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకొచ్చాడు.. ఎవ‌రీ అమోల్ ముజుందార్ ?

టీమిండియా ప్లేయర్లకు ₹1000 జీతం..మిథాలి రాజ్ సంచ‌ల‌నం

Advertisement

1973 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు టీమిండియా మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవలేకపోయింది. ఫైనల్ దాకా వెళ్ళినా కూడా చాలా సార్లు ఓడిపోయింది. కొన్నిసార్లు గ్రూప్ స్టేజిలోనే టీమిండియా ఎలిమినేట్ అయింది. అలాంటి టీమిండియా…హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ( Harman preet kaur) కెప్టెన్సీలో 2025 టోర్నమెంట్ ట్రోఫీని ఎగురేసుకు వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాల గురించి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ వివరించారు. ఇప్పుడు టీమిండియా మహిళా ప్లేయర్లకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బీసీసీఐ కూడా జీతాలు బాగానే ఇస్తోంది.. పురుషుల క్రికెటర్లతో సమానంగా ఇప్పుడు మహిళలు అందుకుంటున్నారు అని తెలిపింది.

కానీ ఈ 2005 వరల్డ్ కప్ సమయంలో ఇలాంటి పరిస్థితులు లేవని వివరించింది మిథాలి రాజ్. ఆ సమయంలో ఒక్క మ్యాచ్ కు 1000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేవారని ఆమె వెల్లడించారు. అలా 2005 వరల్డ్ కప్ టోర్నమెంటులో టీమిండియా మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడగా… ఒక్కో ప్లేయర్ కు 8000 రూపాయలు మాత్రమే వచ్చినట్లు గుర్తు చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదని వివరించింది. టీమిండియా పురుషుల జట్టుతో సమానంగా మహిళలకు కూడా సాలరీస్ ఇస్తున్నారని వెల్లడించింది. దానికి తగ్గట్టుగానే టీమిండియా మహిళల జట్టు వాడుతోందని ఆమె పేర్కొన్నారు. దీనంతటికి కారణం ఐసీసీ చైర్మన్ జై షా అని వెల్లడించింది. బీసీసీఐ చైర్మన్ గా జైషా నియామకం అయిన తర్వాత టీమిండియా మహిళలకు న్యాయం జరిగిందని ఆమె కొనియాడారు. అంతకుముందు దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైషాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవచ్చని ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో మిథాలి రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రూ.51 కోట్ల న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ

Advertisement

వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన‌ టీమిండియాకు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది బీసీసీఐ. రూ.51 కోట్ల ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. అటు ఐసీసీ త‌ర‌ఫున దాదాపు రూ.40 కోట్లు రానున్నాయి.

Also Read: Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×