Womens World Cup 2025: క్రికెట్ లో ఒక్క క్యాచ్ పూర్తి మ్యాచ్ గమనాన్ని మార్చేస్తుందటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే అన్ని జట్లు ఫీల్డింగ్ పై ఎక్కువగా దృష్టి సారిస్తాయి. ఈ నేపథ్యంలోనే మనం క్రికెట్ మైదానంలో ఎన్నో గొప్ప క్యాచ్ లను చూశాం. బంతి ఫీల్డర్ దిశగా గాల్లోకి ఎగిరిందా.. క్రీడాకారులకే కాదు.. ప్రేక్షకులకు కూడా ఎంతో ఉత్కంఠె. ఎందుకంటే గెలుపు, ఓటములను నిర్ణయించగల సత్తా దీనిది. దీనిని బట్టే క్రికెట్ లో క్యాచ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా ఈ క్యాచ్ లే జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు ఏంటో చెబుతాయి. అంతెందుకు.. మ్యాచ్ గెలవాలనే దృఢ సంకల్పాన్ని తోటి ఆటగాళ్లలో, అభిమానులలో క్రీడా స్ఫూర్తిని చాటుతాయి. ఈ క్రమంలో టీమిండియా తలరాతను మార్చిన ఓ మూడు క్యాచ్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Ind vs Aus: వాషింగ్టన్ సుందర్ విద్వంసం.. భారత్ ఘనవిజయం
1983లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే భారత్ ప్రపంచ కప్ గెలిచింది అని చెప్పేకన్నా.. కపిల్ దేవ్ గెలిపించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర. అలాగే అతడి ఆల్ రౌండ్ ప్రదర్శన అమోఘం. 1983లో వెస్టిండీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వివ్ రిఛర్డ్స్ క్యాచ్ ని కపిల్ దేవ్ అందుకున్న తీరు నేటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. కపిల్ దేవ్ అందుకున్న ఈ క్యాచ్ తో భారత క్రికెట్ చరిత్ర మలుపు తిరిగింది. కనీసం ఆటగాళ్లకు షూస్ కూడా కొనివ్వలేని దయనీయ స్థితిలో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} నేడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుందంటే.. 1983లో కపిల్ దేవ్ తీసుకున్న క్యాచ్ తో భారత్ ప్రపంచ కప్ గెలవడంతోనే సాధ్యమైంది.
2024 టి-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమి అంచున ఉన్న సమయంలో ఒకే ఒక్క క్యాచ్ భారత్ ని గెలుపు బాట పట్టించింది. అదే సూర్య కుమార్ యాదవ్ ఒడిసిపట్టిన క్యాచ్. ఆ క్యాచ్ సూర్య కుమార్ యాదవ్ పట్టకపోతే మనకు వరల్డ్ కప్ దొరికేది కాదు. క్లిష్ట సమయంలో ఒత్తిడికి లోను కాకుండా బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ పట్టిన క్యాచ్ అద్భుతం అని చెప్పాలి. 17 సంవత్సరాల తర్వాత ఇండియా టి-20 వరల్డ్ కప్ అందుకుందంటే అది సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ అని ఖచ్చితంగా చెప్పాలి. చివరి ఓవర్ లో సౌత్ ఆఫ్రికా 16 పరుగులు చేయాల్సిన సమయంలో.. దూకుడు మీద ఉన్న మిల్లర్ ఇక మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ బంతిని గాల్లోకి లేపాడు. అది సిక్స్ అనుకుని అంతా నీరసంగా ఉండిపోయారు. కానీ ఆ క్షణంలోనే అద్భుతం జరిగింది. బౌండరీ లైన్ వద్ద చిరుత కంటే వేగంతో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఆ బంతిని పట్టేశాడు. ఆ వేగాన్ని ఆపుకోలేక బౌండరీ లైన్ దాటేశాడు. కానీ అందుకున్న బంతిని సెకండ్ లో గాల్లోకి విసిరి.. తిరిగి వచ్చి ఆ బంతిని పట్టుకొని ఔరా అనిపించాడు. అలా సిక్స్ వెళ్లే బంతిని సూర్య కుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్ భారత్ కి వరల్డ్ కప్ సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషించింది.
ఆదివారం రోజు భారత్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా అద్భుత సెంచరీతో రాణించింది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాని గెలిపించేలా కనిపించింది. అయితే ఆ సమయంలో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరం ఉంది. దీంతో ఇక మ్యాచ్ చేజారిపోనుందా..? అనే అనుమానం కూడా క్రీడాభిమానులకు వచ్చింది. అదే సమయంలో దీప్తి శర్మ వేసిన 42వ ఓవర్ లో లారా ఓ భారీ షాట్ కొట్టింది.
Read Also: Lara: గంభీర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడు… టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడు
బంతి గాల్లోకి ఎగిరి డీప్ మిడ్ వికెట్ పైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అమన్ జ్యోత్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బంతిని పట్టే ప్రయత్నం చేసింది. అయితే మొదట ఆమె చేతుల్లో నుండి బంతి జారిపోయింది. దీంతో వెంటనే తేరుకొని మళ్ళీ ప్రయత్నించింది. రెండవసారి కూడా బంతి చేయి జారిపోయింది. కానీ మూడోసారి ఒకే చేత్తో నేలకు అంగుళాల దూరంలో బంతిని గట్టిగా పట్టేసింది. ఆ క్షణంలో మొత్తం స్టేడియం ఎంతో ఆనందంతో మార్మోగిపోయింది. ఇలా ఈ మూడు క్యాచ్ లు టీమిండియా తలరాతను మార్చేశాయి.