Amol Muzumdar: ఆదివారం భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించడంతో ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టి మొత్తం టీమిండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, సెమీస్ లో అద్భుత సెంచరీ చేసిన జమీమా రోడ్రిక్స్ వంటి ఆటగాళ్లపై పడింది. కానీ ఈ విజయం వెనక ఒకరి కృషి ఎంతగానో ఉంది. ఆయన మరెవరో కాదు మహిళల క్రికెట్ జట్టు కోచ్ అమూల్ మజుందార్. భారత జట్టుకు ఆడాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయినప్పటికీ.. కోచ్ గా జట్టును ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టి తన దశాబ్దాల కలను సహకారం చేసుకున్నాడు.
Also Read: Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?
అమోల్ ముజుందార్.. ముంబై క్రికెట్ ప్రపంచంలో సుపరిచితమైన పేరు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాన్ని తీర్చిదిద్దిన గురువు రమాకాంత్ ఆచ్రేకర్ వద్దే శారదాశ్రమ్ విద్యా మందిర్ లో ఈయన కూడా శిక్షణ పొందారు. సచిన్ టెండూల్కర్ తో కలిసి చాలా ఏళ్లు క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. క్లాసికల్ బ్యాటింగ్, అద్భుతమైన టైమింగ్ తో దేశవాళి క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. ఈయనను ఒకప్పుడు జూనియర్ సచిన్ అని కూడా పిలిచేవారు. 1993 – 94 లో హర్యానా పై తన తొలి రంజీ మ్యాచ్ లోనే ఏకంగా 260 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఈ రికార్డ్ దాదాపు 25 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. రెండు దశాబ్దాల తన కెరీర్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1,167 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. ముంబై జట్టుకు మూల స్తంభంగా నిలిచాడు. 2006 – 07లో అమోల్ సారథ్యంలోనే ముంబై 37 వ సారి రంజీ ట్రోఫీ గెలుచుకుంది. ఇంత అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ ఆ సమయంలో భారత జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వి.వి.ఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు భారత మిడిల్ ఆర్డర్ లో పాతుకుపోయిన సమయంలో.. అమోల్ లాంటి ప్రతిభావంతుడికి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. అలా జాతీయ జట్టు తరఫున ఆడాలన్న కల నెరవేరకపోయినా.. క్రికెట్ పై ఆయనకు ఉన్న ప్రేమ, అనుభవం కోచింగ్ వైపు మళ్ళించాయి. దీంతో కాలం ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చింది. తను సాధించలేని కళలను తన శిష్యురాళ్లతో నెరవేర్చుకునే అద్భుతమైన పాత్ర లభించడంతో తాను ఏంటో నిరూపించుకున్నాడు.
Also Read: Hardik Pandya: ఛాంపియన్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హర్ధిక్ పాండ్యా
ఇక భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కోచ్ అమోల్ మాట్లాడుతూ.. “ఇది మహిళా క్రికెట్ కి సువర్ణాధ్యాయం. రెండు సంవత్సరాల క్రితం భారత జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములను చవిచూసాం. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. భారత మహిళా క్రికెట్ అద్భుతం చేసింది. ఇప్పుడు సాధించిన దానికి వారు పూర్తి అర్హులు. ఎంతో కఠినమైన శ్రమ, నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన జట్టుకు అభినందనలు. నేను కోచ్ గా వచ్చిన తొలినాళ్లలో ఓటములు ఎదురయ్యాయి. కానీ వాటినుండి చాలా పాటలు నేర్చుకున్నాం. కొన్ని మ్యాచ్ లలో ఇంకా మెరుగైన ఫినిష్ చేయాల్సింది. కానీ చేయలేకపోయాం. ఇప్పుడు ముగింపు మాత్రం అద్భుతం” అని చెప్పుకొచ్చాడు.