E-Paper
Advertisement

నిద్ర‌పోయిన అంపైర్లు..ఒకే బంతికి రెండు సార్లు నితీష్ రాణా ఔట్..తెర‌పైకి కొత్త వివాదం

నిద్ర‌పోయిన అంపైర్లు..ఒకే బంతికి రెండు సార్లు నితీష్ రాణా ఔట్..తెర‌పైకి కొత్త వివాదం
Advertisement

Nitish Rana Wicket:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Delhi Capitals vs Chennai Super Kings, 48th Match) మధ్య 48వ మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ నితీష్ రాణా ( Nitish Rana) ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడు. అంపైర్లు నిద్రపోయిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నూర్ అహ్మద్ వేసిన ఓ అద్భుతమైన బంతికి… కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు నితీష్ రాణా. అదే సమయంలో హిట్ వికెట్ అయినట్లు కూడా ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఒకే బంతికి రెండు సార్లు నితీష్ రాణా ఔట్ అయ్యాడని రచ్చ చేస్తున్నారు అభిమానులు.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

నిద్ర‌పోయిన అంపైర్లు..ఒకే బంతికి రెండు సార్లు నితీష్ రాణా ఔట్

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా.. నితీష్ రాణా రెండుసార్లు ఔట్ అయినట్లు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో నూర్ అహ్మద్ బౌలింగ్ లో నితీష్ రాణా 15 పరుగుల వద్ద కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే కార్తీక్ శర్మ క్యాచ్ పట్టకముందే..బెయిల్స్‌ కింద పడ్డాయి. దీంతో నితీష్ రాణా హిట్ వికెట్ అయ్యాడని అంటున్నారు. అసలు వాస్తవం అది కాదు. నితీష్ రాణా షాట్ ఆడగానే, సంజు శాంసన్ గ్లోవ్స్‌ తగిలి బెయిల్స్‌ పడ్డాయి. ఈ క్రమంలోనే కార్తిక్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో క్యాచ్ కింద నితీష్ రాణాను ఔట్ గా ప్రకటించారు. వాస్తవంగా బెయిల్స్‌ పడిన తర్వాత ఎలాంటి క్యాచ్ అందుకున్న.. అది నో-బాల్ గా ప్రకటించాలి. కానీ అంపైర్లు నిద్రపోయిన నేపథ్యంలో… 15 పరుగుల వద్ద నితీష్ రాణా వెను తిరగాల్సి వచ్చింది. దీంతో నితీష్ రాణా వికెట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై ఢిల్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

 

Advertisement

 

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×