E-Paper
Advertisement

Abrar Ahmed: శిఖ‌ర్ ధావ‌న్ ప‌ళ్లు రాల‌గొడ‌తా…రెచ్చిపోయిన‌ అబ్రార్ అహ్మద్

Abrar Ahmed: శిఖ‌ర్ ధావ‌న్ ప‌ళ్లు రాల‌గొడ‌తా…రెచ్చిపోయిన‌ అబ్రార్ అహ్మద్

Abrar Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభం కాకముందే హిట్ మొదలైంది. దీని అంతటికి కారణం కావ్య పాప ( Kavya Maran) చేసిన ఒకే ఒక్క తప్పిదం. ‘ది హండ్రెడ్ ‘ టోర్నమెంట్ వేలంలో ( The Hundred Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) ఓనర్ గా ఉన్న కావ్య పాప కొనుగోలు చేశారు. దీంతో నిన్నటి నుంచి కావ్య పాపను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు ఇండియన్స్. ఆమెను దేశద్రోహి అంటూనే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ( SRH ) బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు కూడా వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కావ్య పాపకు మరో తలనొప్పి తీసుకువచ్చాడు అబ్రార్ అహ్మద్. శిఖర్ ధావన్ పళ్ళు రాలగొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అబ్రార్ అహ్మద్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

శిఖ‌ర్ ధావ‌న్ ప‌ళ్లు రాల‌గొడ‌తా

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు కావ్య పాప పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన శిఖర్ ధావన్ కు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అతడు కనిపిస్తే ముఖం పైన గుద్ది, పళ్ళు రాలగొడతానంటూ హెచ్చరించాడు. అయితే ఇది కావాలని అబ్రార్ అహ్మద్ అనలేదు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తరుణంలో టంగ్ స్లిప్ అయ్యాడు. బ్యాటర్లందరూ బంతులను ఎదుర్కొనే సమయంలో టెన్షన్ పడతారు.. కానీ శిఖర్ ధావన్ అలా కాదు.. చాలా భయంకరమైన ఆటగాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్. బౌలర్ తెలివిగా బంతి వేసినప్పటికీ కూడా భయపడకుండా, గర్జిస్తూ చూస్తాడని వెల్లడించారు.

అలాంటి శిఖర్ ధావన్ పళ్ళు రాలగొట్టాలని అప్పట్లో అబ్రార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన నేపథ్యంలో పాత వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ ఇండియన్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఈ వీడియోలపై నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావ్య పాప కోసం చాలా సంవత్సరాలు ఆడిన శిఖర్ ధావన్ ను తాజాగా కొనుగోలు చేసిన అబ్రార్ అహ్మద్ పళ్ళు రాలగొడతానని అంటున్నాడు.. దీనిపై కావ్య పాప ఏం సమాధానం ఇస్తుందని నిలదీస్తున్నారు ఫ్యాన్స్. భారతీయుడిని కొడతానని చెప్పిన పాకిస్తాన్ వాడిని ఎందుకు కొనుగోలు చేశావ్ ? నీకు అసలు దేశభక్తి ఉందా ? వెంటనే పాకిస్తాన్ వెళ్లిపో అంటూ కావ్య పాప పై మండిపడుతున్నారు. అయితే గ‌తంలో శిఖ‌ర్ ధావ‌న్ పై అబ్రార్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కావ్య మార‌న్ కు త‌ల‌నొప్పి తీసుకువ‌స్తున్నాయి.

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×