E-Paper
Advertisement

Portugal in quarter finals : పోర్చుగల్ జిగేల్

Portugal in quarter finals : పోర్చుగల్ జిగేల్
Advertisement

Portugal in quarter finals : ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగల్ అదరగొట్టింది. స్విట్జర్లాండ్‌పై గోల్స్ మోత మోగించి… 6-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. పోర్చుగల్ చేసిన 6 గోల్స్‌లో… గొంకలో రామోస్‌ ఒక్కడే మూడు గోల్స్‌ చేసి… స్విస్‌ జట్టును బెంబేలెత్తించాడు. మ్యాచ్ మొత్తం మీద బంతి ఎక్కువగా స్విట్జర్లాండ్ నియంత్రణలోనే ఉన్నా… ఆ జట్టు ఆటగాళ్లు పోర్చుగల్‌ కంటే ఎక్కువ పాస్‌లు అందించుకున్నా… గోల్స్ చేయలేకపోయారు. మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఆటగాళ్లు దూకుడుగా ఆడితే… స్విస్‌ ఆటగాళ్లు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయారు. ఆట 17వ నిమిషంలో జావో ఫెలిక్స్‌ నుంచి పాస్‌ అందుకున్న రామోస్‌… బంతిని గోల్‌పోస్టులోకి పంపి పోర్చుగల్‌కు తొలి గోల్ అందించాడు. 33వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెస్‌ నుంచి పాస్‌ అందుకున్న పీప్‌… కళ్లుచెదిరేలా హెడర్ గోల్‌ కొట్టాడు. దాంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది… పోర్చుగల్. రెండో అర్ధభాగంలోనూ పోర్చుగల్ దూకుడుగా ఆడింది. 51వ నిమిషంలో రామోస్‌ మరో గోల్‌ కొట్టి… జట్టు ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మరో నాలుగు నిమిషాలకే రామోస్‌ నుంచి పాస్‌ అందుకున్న రాఫేల్‌ గెరీరో… గోల్‌ కొట్టి జట్టును 4-0 లీడ్‌లో నిలిపాడు. అయితే ఆట 58వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ఆటగాడు మాన్యువల్‌ అకంజీ గోల్‌ చేయడంతో… స్విస్‌ ఖాతాలో తొలి గోల్ పడింది. ఇక 67వ నిమిషంలో మరోసారి రామోస్‌, మ్యాచ్‌ అదనపు సమయంలో రాఫేల్‌ లియో గోల్‌ చేసి… పోర్చుగల్‌ను 6-1 ఆధిక్యంలో నిలిపారు. చివరికి స్విట్జర్లాండ్ ఫిఫా వరల్డ్‌కప్‌లో తన ప్రస్థానాన్ని ముగించగా… 6-1 గోల్స్ తేడాతో గెలిచిన పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో… స్పెయిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన మొరాకోతో తలపడనుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×