E-Paper
Advertisement

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌…PSL 2027 ప్రారంభంపై సంచ‌ల‌న నిర్ణ‌యం

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌…PSL 2027 ప్రారంభంపై సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

PSL 2027 VS IPL 2027: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఈ మధ్య సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును పటిష్టంగా తయారు చేసేందుకు వినూత్నమైన ఆలోచనలకు కూడా రూపొందిస్తోంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం, హిట్టర్లుగా మార్చేందుకు ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు సాగుతోంది. అయితే లేటెస్ట్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను ( IPL) దెబ్బ కొట్టేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 ( IPL 2027) ప్రారంభం కంటే ముందే…పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ ను (PSL 2027) ప్రారంభించేలా మొహ్సిన్ నఖ్వీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ లు ప్రతి ఏడాది ఒకేసారి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇక మొన్న జరిగిన ఐపీఎల్ 2026, PSL ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను వదిలేసి…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు మొగ్గు చూపారు. చాలామంది పాకిస్తాన్ వెళ్లి మరి… వెనక్కి వచ్చారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎక్కువ డబ్బులు వచ్చిన నేపథ్యంలో.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇలాంటి సమస్య ఇకపైన తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే వచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంటును ఐపీఎల్ ప్రారంభం కాకముందే నిర్వహించేలా సన్నద్ధం అవుతోంది. ఐపీఎల్ 2027 ప్రారంభం కాకముందే… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ ప్రారంభించి.. ఫినిష్ కూడా చేయాలని స్కెచ్ వేసింది. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు లాభం జరగడమే కాకుండా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు తీవ్ర నష్టం జరుగుతుందని అంచనాకు వచ్చారు నఖ్వీ.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లాభం ఏంటి ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ ముందుగా ప్రారంభిస్తే… విదేశీ క్రికెటర్లందరూ హాజరవుతారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ ముగిసే వరకు విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉంటారు. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంది. వ్యూయర్షిప్ కూడా దక్కుతుంది. అంతర్జాతీయంగా ఈ టోర్నమెంటుకు గుర్తింపు వస్తుంది. అదే సమయంలో ఐపీఎల్ కు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడిన విదేశీ క్రికెటర్లు… ఐపీఎల్ నుంచి భారీ ఆఫర్లు వచ్చిన ఆడే అవకాశాలు ఉండవు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మొత్తం నెల రోజులు ఆడిన తర్వాత… విదేశీ క్రికెటర్లు రెస్ట్ పేరుతో ఐపిఎల్ ను స్కిప్ చేస్తారు. అప్పుడు బీసీసీఐకి దెబ్బ పడే ఛాన్సులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

Big Stories

Advertisement
×