Dinesh Karthik flexing Lord Shiva: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ ( India tour of England, 2026 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళవారమే ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి వన్డే ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ వేదికగా జరగగా.. టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇవాళ రెండో వన్డే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) నటరాజ (nataraja shot) అవతారం ఎత్తినట్లు దినేష్ కార్తీక్ (Dinesh Karthik) తన మొబైల్ లో ఫోటోలు చూపించి రచ్చ చేశారు. అతడు ఆడే ప్రతి షాట్..నాట్యం చేసినట్లుగానే ఉంటుందని అర్థం వచ్చేలా నటరాజ్ ఫోటోలు చూపించాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ చూపించిన నటరాజ్ విగ్రహం ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్… తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. రోహిత్ శర్మలో శివుడే దూరి (Dinesh Karthik flexing Lord Shiva), అలాంటి షాట్లు ఆడిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ మంగళవారం జరిగింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ… భారీ స్కోర్ చేయలేదు. 11 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. ఇందులో ఒకే ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీ కూడా ఇంగ్లాండ్ డేంజర్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సాధించాడు. అయితే ఆ సందర్భంగా దినేష్ కార్తీక్ కామెంట్రీ చేస్తూ… నటరాజ్ డాన్స్ చేసినట్లుగానే రోహిత్ శర్మ బౌండరీ కొడుతూ ఫోజు ఇచ్చాడని కామెంట్ చేశాడు. అయితే పక్కనే ఉన్న స్టువర్ట్ బ్రాడ్ ఎవరు ఈ నటరాజ్ ? అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన మొబైల్ లో నటరాజ విగ్రహాన్ని చూపిస్తూ.. అతని లాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడని స్పష్టం చేశారు దినేష్ కార్తీక్. అతడి షాట్లు ఆ శివుడు డాన్స్ చేసినట్లుగానే ఉంటాయని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు దినేష్ కార్తీక్ ప్రైవేట్ పార్ట్ పైన రోహిత్ శర్మ తన్నిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. అందుకే సరదాగా దినేష్ కార్తీక్ ను ఆటపట్టించాడు రోహిత్ శర్మ.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
Dinesh Karthik flexing Lord Shiva's iconic Nataraj frame after watching Rohit Sharma's shot off Jofra Archer. pic.twitter.com/9HW4IAZDaU
— Varun (@Defending_18) July 14, 2026