Munaf Patel On Dhoni Hookah Party: మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియా కెప్టెన్ పదవి దక్కించుకున్న మహేంద్రసింగ్ ధోని… ఆ తర్వాత జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనిపై రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇర్ఫాన్ పఠాన్ (irfan pathan) కూడా వివాదాస్పద కామెంట్ చేశారు. హుక్కా తాగేవాళ్లు, దాని కోసం రూంలో ఏర్పాట్లు చేసిన వాళ్లకే, అప్పటి కెప్టెన్ ధోని, టీమిండియాలో అవకాశాలు ఇచ్చేవాడు అంటూ ఆరోపణలు చేశారు. అయితే, దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ (Munaf Patel) స్పందించారు. నోరు ఉన్న ప్రతి ఒక్కడు మహేంద్ర సింగ్ ధోని గురించి చెడుగా మాట్లాడడమే అంటూ ఫైర్ అయ్యారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత… ధోనిపై బురద చల్లడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. మహేంద్ర సింగ్ ధోని హుక్కా (Dhoni Hookah Party) విషయాన్ని టీమ్ ఇండియా జట్టులో ఉన్నప్పుడే ఎందుకు బహిర్గతం చేయలేదంటూ నిలదీశారు. పాపులారిటీ కోసం చాలా మంది కారు కూతలు కూస్తారని రెచ్చిపోయారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హుక్కా కొడతాడు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ హుక్కా (Dhoni Hookah Party) కొట్టిన వాళ్లకి టీమ్ ఇండియాలో అవకాశాలు వస్తాయని ఇర్ఫాన్ పఠాన్ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు మునాఫ్ పటేల్. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు… టీమిండియా జట్టులో ఉన్నప్పుడు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తే అయిపోవు కదా ? ఇప్పుడెందుకు పాత ముచ్చట్లు అంటూ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు చాలా మంది దిగజారుతున్నారని పరోక్షంగా ఇర్ఫాన్ పఠాన్ ను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇలా అనేక మంది ధోని పై బురద చల్లారని ఫైర్ అయ్యారు.
అదే ఆరోపణలకు మహేంద్ర సింగ్ ధోని కౌంటర్ ఇవ్వడం మొదలుపెడితే.. అవతలివాడు తట్టుకోలేడని హెచ్చరించారు. ప్రతి ఆరోపణలను ఎదుర్కొంటూ.. మౌనంగా మహేంద్ర సింగ్ ధోని ఉంటున్నాడని… అది అతడి లక్షణం అంటూ కితాబిచ్చారు. అన్ని అవమానాలను ఎదుర్కొన్నాడు కాబట్టే… మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ఈ స్టేజి లో ఉన్నాడని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్, ఇశాంత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, తాను అలాగే సచిన్ టెండూల్కర్ తమ జీవితంలో ఎప్పుడూ కూడా సిగరెట్ తాగలేదన్నారు. మిగతా క్రికెటర్లకు అలాంటి అలవాట్లు ఉంటే… ఉండవచ్చు, అందులో తప్పు లేదన్నారు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని నిజంగానే హుక్కా కొట్టమని పిలిస్తే… నచ్చితే వెళ్ళు, లేకపోతే వదిలేస్తే సరిపోవు అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి టీమిండియాలో సెలక్షన్ కి సంబంధం పెట్టకూడదని కోరారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==