IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఈ ఫైట్ ఉండనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్లు కూడా మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. అయితే ఫైనల్స్ ఇవాళ జరగనున్న నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుందని.. ఈ మేరకు ఇప్పటికే ఫిక్సింగ్ (Match Fixing) జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐసీసీ బాస్ జై షా (ICC jay shah) ఈ మేరకు స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ చేశాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో ICC బాస్ జై షా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫైనల్స్ కంటే ముందు ఫిక్సింగ్ జరిగినట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. ఓడిపోతామన్న భయమో? లేక ఇతర కారణాలో? తెలియదు కానీ, గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్గా నిలుస్తుందని బెంగళూరు అభిమానులే పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ICC బాస్ జై షా స్క్రిప్టు సిద్ధం చేశాడని కూడా ఆరోపణలు చేస్తున్నారు. జై షాకు గుజరాత్ టైటాన్స్ జెర్సీ వేసి మరి, దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జై షా అందరూ గుజరాత్ వాళ్లని.. అందుకే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించేలా ఫిక్సింగ్ చేశారని కూడా పోస్టులు పెడుతున్నారు. అందుకే టెస్ట్ ప్లేయర్లు ఉన్న గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ కాబోతుందని వెల్లడిస్తున్నారు. అయితే దీనికి గుజరాత్ అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తమ చేతిలో ఓడిపోతే, ఫిక్సింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు అని ముందు నుంచే బెంగళూరు అభిమానులు ప్రిపేర్ అయ్యారని కౌంటర్లు పేల్చున్నారు. ఫిక్సింగ్ లేదు, బొక్క లేదు.. ఇదంతా బెంగుళూరు అభిమానుల ప్రచారం అంటూ ఫైర్ అవుతున్నారు.
రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పిచ్ నెంబరు 6 సిద్ధం చేశారు. లీగ్ దశలో ఇదే పిచ్ పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది గుజరాత్ టైటాన్స్. అందుకే ఇదే తరహాలో ప్లాన్ చేస్తోంది. ఇది వర్క్ అవుట్ అయితే గుజరాత్ నిజంగానే ఛాంపియన్ కానుంది.
🚨 RCB vs GT Final script leaked by Jay Shah 🚨
> It’s the night of 31st May
Ahmedabad is fully packed with red jerseys everywhere
> Rajat Patidar and RCB management give Virat Kohli one last chance as captain to lift the IPL trophy
> Virat wins the toss and chooses to bat first… pic.twitter.com/4kF8AxEABI— Drashti CSKian 💛 (@drashtisingh07) May 30, 2026