Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో అదుపు తప్పిన ఓ కారు.. సుమారు 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అసలు ఎలా జరిగింది?
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదకరమైన ప్రాంతంలో ఓ కారు అదుపు తప్పింది. ఫలితంగా 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది టూరిస్టులు ఉన్నారు. వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.
టూరిస్టులతో ప్రయాణిస్తున్న బొలెరో.. కలబన్ ప్రాంతం సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదకరమైన ప్రాంతంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్పాట్‌లో వాహనంలో ఉన్నవారంతా మరణించినట్లు చెబుతున్నారు.
లోయలోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లో 8 మంది మృతి
మృతుల్లో కోల్‌కతా, బెంగళూరు నగరాలకు చెందిన టూరిస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని సమాచారం. టూరిస్టులతోపాటు వాహనం నడిపిస్తున్న డ్రైవర్ మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ పర్వతాలను సందర్శించేందుకు దల్హౌసీలో ఒక టాక్సీని అద్దెకు తీసుకుంది.
ఆ తర్వాత ఆ హిల్ స్టేషన్‌లో బస చేస్తున్న మరో టూరిస్టు ఫ్యామిలీ ఆ వాహనాన్ని షేర్ చేసుకుని బయలు దేరారు. శుక్రవారం సచ్ పాస్ మీదుగా బైరాగఢ్-కిల్లార్ మార్గంలో పర్యటనకు బయలు దేరాయి రెండు కుటుంబాలు. షెడ్యూల్ ప్రకారం టాక్సీ.. దల్హౌసీకి తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. వాహన యజమాని ఆ తర్వాత జీపీఎస్ ఉపయోగించి టాక్సీని ట్రాక్ చేశాడు.
ALSO READ: విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి
కలబన్ సమీపంలో కదలకుండా నిలిచిపోయినట్టు గుర్తించాడు. దీనిపై విచారణ జరపగా ఆ వాహనం లోతైన లోయలో పడిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ట్యాక్సీ ఓనర్. రంగంలోకి దిగిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
సహాయక చర్యల్లో పోలీసులు-జాతీయ విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు వాహనాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ స్పందించారు. అత్యంత హృదయ విదారకం ఘటనగా వర్ణించారు. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల సహాయక బృందాలు సవాళ్లను ఎదుర్కొంటోందని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
#BREAKING Tragic news from Chamba: A tourist vehicle fell into a 500-foot gorge near Kalaban on Bairagarh-Sach Pass-Killar route. 7-8 casualties feared. Rescue ops underway.
#Chamba #RoadAccident #HimachalPradesh @hp_police @HPPWD @diprhp https://t.co/zl2Ks7eN5Z pic.twitter.com/qWjuurtAYA
— jarvis ☠️ (@Vishii14) May 31, 2026