RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 20 మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది ముంబై ఇండియన్స్. ఇందులో ముంబై ఇండియన్స్ ఓడినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా ఇంటి దారి పట్టాల్సిందే. దానికి తగ్గట్టుగానే ఇవాళ మ్యాచ్ జరగబోయే రాయ్ పూర్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో ముంబై ఇండియన్స్ ఓనర్లు టెన్షన్ పడుతున్నారు. వర్షం పడకూడదని వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Mumbai Indians) మధ్య ఇవాళ రాయిపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్నటి నుంచి రాయిపూర్ లో భారీ వర్షం పడుతుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టాస్ సమయం నుంచే వర్షం మళ్లీ షురూ అవుతుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ సాయంత్రం 90 శాతం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. నిన్న కూడా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్ కూడా వర్షం కారణంగా రద్దయింది.. ఇక ఇవాళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే మాత్రం… బెంగళూరు అలాగే ముంబై ఇండియన్స్ చెరో పాయింట్ దక్కుతుంది.
దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 13 పాయింట్స్ తో మూడవ స్థానానికి చేరుకుంటుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి అయిపోతాయి. ఇంటిదారి పట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పది మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఏడింటిలో ఓడిపోయింది. ఈ క్రమంలో ఆరు పాయింట్లతో టేబుల్ లో 9వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ రద్దు అయినా మిగతా మూడు మ్యాచ్ లలో గెలిచిన కూడా 13 పాయింట్లు మాత్రమే వస్తాయి. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ ఇంటి దారి పట్టాల్సిందేనని అంటున్నారు నిపుణులు. దీంతో ఇవాళ వర్షం పడకూడదని వరుణ దేవుడిని మొక్కుతున్నారు ముంబై ఇండియన్స్ ఓనర్లు, అభిమానులు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా మరోసారి దూరం కాబోతున్నాడు. ఇటీవల తండ్రి అయిన సూర్య కుమార్ యాదవ్ జట్టులో చేరిపోయాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ జట్టును లీడ్ చేయనున్నాడు. అటు రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
There’s a major rain threat looming over the MI vs RCB match in Raipur. Heavy showers and strong winds have forced the entire ground to remain under cover today. #MIvsRCB #TATAIPL #Cricket #IPL2026 pic.twitter.com/fHacWZPZ3i
— MK Sharma ✍️ (@EmediaManoj) May 9, 2026