Venkatesh -Anil Ravipudi: విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్ గారు'(కేమియో) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ కాంబోలో 5వ సినిమా కూడా రూపొందనుంది. వెంకటేష్ ఇమేజ్ కి సరిపడేలా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని రెడీ చేశాడు అనిల్. ఇందులో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉంది. దాని కోసం నందమూరి కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ ని తీసుకోవడం వల్ల నిర్మాతలకి ఏకంగా రూ.12.5 కోట్లు సేవ్ అయ్యాయట. అదెలా అంటారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
మొదట ఈ పాత్ర కోసం మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌ను అనుకున్నారు. నిర్మాతలతో పాటు దర్శకుడు కూడా ఆయన వైపు మొగ్గు చూపారు.అయితే ఫహాద్ ఈ పాత్ర కోసం ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడు. అందుకు కూడా మేకర్స్ సరే అన్నారు. కానీ పారితోషికంతో పాటు ఫహాద్ డిమాండ్స్ లిస్ట్ ఇంకా ఎక్కువగా ఉందట. దాని వల్ల దర్శకుడు అనిల్ రావిపూడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావించారు. కేవలం ఒక నటుడి కోసం ఇన్ని డిమాండ్లు అవసరమా అని భావించి.. ఫహాద్ ని లైట్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఆ వెంటనే అనిల్ రావిపూడి తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన తన గాడ్ ఫాదర్ లాంటి కళ్యాణ్ రామ్‌ను మరో హీరోగా ఎంపిక చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమా కోసం రూ. 7.5 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫహాద్‌తో పోలిస్తే ఇక్కడే ప్రొడక్షన్ హౌస్‌కు సుమారు రూ. 12.5 కోట్లు ఆదా అయ్యాయి అని మనం అర్ధం చేసుకోవచ్చు.కళ్యాణ్ రామ్ మార్కెట్ విలువల పరంగా చూసినా ఇది తెలివైన నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది.నాన్-థియేట్రికల్ రైట్స్ పరంగా చూసినా మరో రూ. 5 నుంచి 6 కోట్ల వరకు ఆదాయం వచ్చే వీలుంది. అందుకే ఫహాద్ ఫాజిల్ ని పక్కన పెట్టి.. మేకర్స్ కళ్యాణ్ రామ్ కి ఫిక్స్ అయ్యారు.
2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమా..
ఇక ఈ ప్రాజెక్టుని ‘షైన్ స్క్రీన్స్’ సంస్థ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘జీ’ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వామ్యం వహించనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్ లో తన టీంతో కలిసి ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. జూలైలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళి నవంబర్ ఎండింగ్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ ని కూడా సమాంతరంగా నిర్వహించి 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దింపాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.
Also Read: విజయ్ ప్రమాణ స్వీకారం.. సూపర్ హ్యాపీగా ఉన్నానన్న త్రిష..