E-Paper
Advertisement

RCB Vs PBKS IPL 2024 Highlights: విరాట్ సెంచరీ మిస్ అయినా.. ఆర్సీబీ ఘన విజయం!

RCB Vs PBKS IPL 2024 Highlights: విరాట్ సెంచరీ మిస్ అయినా.. ఆర్సీబీ ఘన విజయం!

IPL 2024 58th Match – Royal Challengers Bengaluru Vs Punjab Kings Highlights: ఐపీఎల్ 2024 సీజన్ మొదట్లో ఆర్సీబీ ఎందుకూ పనికిరాని జట్టులా ఆడింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో చాలాకాలం అట్టడుగు స్థానంలోనే ఉండిపోయింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారి ఊపు, ఉత్సాహం, జోష్ అన్నీ వచ్చాయి. పూనకాలు లోడింగ్ అన్నట్టు బ్యాటర్లు ఊగిపోతున్నారు. ఒకర్ని మించి ఒకరు చితక్కొట్టేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లీ (92) సెంచరీ దగ్గర మిస్ అయినా జట్టుకి విజయాన్ని అందించాడు.

పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ చతికిలపడిపోయింది. 17 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 60 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తక్కువ స్కోరుకి అవుట్ అయిపోయారు. ప్రభుసిమ్రాన్ సింగ్ (6), జానీ బెయిర్ స్టో (27) మాత్రమే చేశారు. అక్కడ కొండలా పెరిగిపోయిన స్కోరుతో పంజాబ్ బ్యాటర్లు అదరలేదు. రిలీ రొసోవ్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్లు సాయంతో 61 పరుగులు చేశాడు.  తను ఉన్నంతవరకు మ్యాచ్ పంజాబ్ చేతిలోనే ఉంది.

Also Read: Gill-Sudharsan Partnership Records: గిల్-సుదర్శన్..సెంచరీలు.. రికార్డుల మీద రికార్డులు

ఎందుకంటే మరో ఎండ్ లో శశాంక్ సింగ్ కూడా దంచి కొట్టాడు. కాకపోతే తను 19 బంతుల్లో 37 పరుగులతో మంచి ఊపు మీద ఉండగా, విరాట్ కొహ్లీ డైరక్ట్ త్రోకి రన్ అవుట్ అయిపోయాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది.

తర్వాత వచ్చినవాళ్లు పెద్దగా ఆడలేదు. జితేష్ శర్మ (5), లివింగ్ స్టోన్, హర్షల్ పటేట్  డక్ అవుట్ అయ్యారు. అర్షదీప్ సింగ్ (4), అశుతోష్ శర్మ (8) వీళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.  దీంతో కెప్టెన్ శామ్ కర్రన్ (22) కాసేపు నిలిచాడు కానీ, రన్ రేట్ పెరిగిపోతుండటంతో షాట్ ట్రై చేసి బౌల్డ్ అయిపోయాడు. చివర్లో రాహుల్ చహర్ (5 నాటౌట్ )గా నిలిచాడు. మొత్తానికి 17 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చివరికి 60 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

Also Read: కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న కేఎల్ రాహుల్.. అందుకేనా?

ఆర్సీబీ బౌలింగులో స్వప్నిల్ సింగ్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్ 3, ఫెర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు.

తొలుత బ్యాటింగు ప్రారంభించిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ (9) త్వరగా అయిపోయాడు. తర్వాత విల్ జాక్స్ (12) కూడా వెంటనే అయిపోయాడు. అంతకు ముందు విరాట్ ఫస్ట్ ఓవర్ లోనే ఒక షాట్ కొట్టాడు. కానీ అది లాంగ్ ఆన్ లో ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. అయితే సులువైన క్యాచ్ ని వదిలేశాడు. దానికి పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

Also Read: MI Vs KKR, IPL 2024 Preview: ముంబై మెరుస్తుందా? నేడు ఈడెన్ గార్డెన్స్ లో.. కోల్ కతాతో మ్యాచ్

తర్వాత కొహ్లీ జాగ్రత్తగా ఆడుతూ 47 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. సరిగ్గా సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు. రజత్ పటీదార్ 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 6 సిక్స్ లు , 1  ఫోర్ మాత్రమే ఉంది. తర్వాత కెమరాన్ గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ (18) చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

పంజాబ్ బౌలింగులో హర్షల్ పటేల్ 3, విద్వత్ కవేరప్ప 2, అర్షదీప్ 1, శామ్ కర్రన్ 1 వికెట్ పడగొట్టారు.

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×