BigTV English

Mallikarjuna Kharge TG Tour: నేడు నకిరేకల్‌కు రానున్న మల్లికార్జున ఖర్గే..!

Mallikarjuna Kharge TG Tour: నేడు నకిరేకల్‌కు రానున్న మల్లికార్జున ఖర్గే..!

Mallikarjuna Kharge to visit Nakirekal: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నకిరేకల్ లో నిర్వహించే కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను కోరనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.


కాగా, గురువారం సరూర్ నగర్, నర్సాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయేది రైతు రుణమాఫీ అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 22 మందిని మాత్రమే బిలియనీర్లను చేసిందని, కానీ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలను లక్షాధికారులను చేస్తామన్నారు. ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ. 400 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంతోనే బలహీనులకు రక్షణ అని ఆయన అన్నారు. అయితే, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తున్నదని ఆయన అన్నారు.

Also Read: మన తాతలు రామనవమి చేయలేదా..? నర్సాపూర్‌ సభలో సీఎం రేవంత్ రెడ్డి


అయితే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు, అదేవిధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశానికి చెందినటువంటి కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×