Big Stories

KL Rahul: కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న కేఎల్ రాహుల్.. అందుకేనా?

KL Rahul Likely to Quit Captaincy: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఘోర పరాజయం పాలైన ఒక రోజు తర్వాత, లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్ పై సీరియస్ అయిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ ఆడనున్న చివరి రెండు లీగ్ మ్యాచులకు కెప్టెన్‌గా వైదొలగవచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన లక్నో 6 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. తమ చివరి రెండు మ్యాచుల్లో లక్నో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

ఇక ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలో చేధించింది. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడి 10 వికెట్ల విజయాన్ని అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పిచ్‌పై లక్నో బ్యాటర్లు మొదటి 10 ఓవర్లలో కనిసం ఆరు పరుగులు రన్ రేట్‌ను కూడా నమోదు చేయలేక పోయారు. దీంతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌పై మండిపడ్డారని తెలుస్తోంది. అయితే లక్నో పేలవ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్న రాహుల్ కెప్టెన్సీ వదులుకుని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

ముఖ్యంగా, MS ధోనిని కెప్టెన్‌గా తొలగించి, వారి రెండవ సీజన్‌లో స్టీవ్ స్మిత్‌ని నియమించినప్పుడు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ యజమాని గోయెంకా కావడం విశేషం.

Also Read: కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం, లక్నో యాజమానికి ఏమైంది? ఏ విషయంలో

మే 14న న్యూఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 17న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో విజయం సాధించి 16 పాయింట్లతో ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ, నికర రన్-రేట్ (-0.760)ను భారీగా మెరుగుపరచడం సవాలుగా మారుతుంది. ఒకవేళ రాహుల్ వైదొలగాలని నిర్ణయించుకుంటే, ఈ సీజన్‌లో జట్టు అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్ అయిన వైస్-కెప్టెన్ నికోలస్ పూరన్ మిగిలిన రెండు గేమ్‌లకు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News