BigTV English
Advertisement

Rahul Gandhi on Crop Loan Waiver: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయేది ఇదే: రాహుల్ గాంధీ!

Rahul Gandhi on Crop Loan Waiver: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయేది ఇదే: రాహుల్ గాంధీ!

After Forming Government Will Crop Loan Waiver said by Rahul Gandhi: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఆగస్టు 15 నుంచి చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు.


‘పలువురు బిలియనీర్లకు మోదీ సర్కారు రూ. 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది.. కానీ, పేదలను మాత్రం పట్టించుకోలేదు.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేసిన ఆ డబ్బులను పేదల అకౌంట్లో వేస్తాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గురువారం తెలంగాణలో పర్యటించిన ఆయన నర్సాపూర్, సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన హామీలను నెరవేర్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రూ. 10 లక్షల ఆరోగ్య బీమా పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పోడు భూముల సమస్యను పరిష్కరించిందని, 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తరహాలోనే దేశంలో కూడా కాంగ్రెస్ మంచి పరిపాలన అందిస్తదని ఆయన అన్నారు.


Also Read: CM Revanth counter on Jagan comments: జగన్‌కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి..

ఇటు బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాజ్యాంగం పేదల గొంతుక.. దేశంలోని పేదలను రాజ్యాంగం రక్షిస్తుంది.. అలాంటి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు.. జరగనియ్యబోమన్నారు. తాము అధికారంలోకి వచ్చినంక రిజర్వేషన్ల శాతాన్ని 50 శాతం కన్నా ఎక్కువగా పెంచుతామన్నారు.

‘దేశాన్ని కొందరు మాత్రమే నడిపిస్తున్నారు.. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి’ అని ఆయన అన్నారు. దేశంలో కులగణన చేయాలన్నారు. కులగణన చేస్తే దేశంలోని ఎవరి బలం ఎంత ఉంది.. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాటా ఎంత ఉండాలో అనేది స్పష్టమవుతుందన్నారు. బీజేపీ కొద్దిమందిని మాత్రమే బలియనీర్లను చేసింది.. కానీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినంక పేదల అకౌంట్లలో డబ్బులు చేసి వారిని లక్షాధికారులను చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన ప్రతి ఇంటిలోని ఓ మహిళ అకౌంట్లో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తాం.. దీంతో దేశంలో ఒక్క దెబ్బతో పేదరికం మాయమవుతుందన్నారు.

Also Read: నేడు నకిరేకల్‌కు రానున్న మల్లికార్జున ఖర్గే

నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శిక్షణ సమయంలో వారికి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ. 400 చెల్లిస్తామన్నారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×