BigTV English
Advertisement

RJ Mahvash: డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ సంచలన ప్రకటన !

RJ Mahvash: డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ సంచలన ప్రకటన !

RJ Mahvash: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్ – కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడిపోయిన విషయం తెలిసిందే. బాంద్రా లోని ఫ్యామిలీ కోర్ట్ ఇరుపక్షాలు దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్ ఆధారంగా విడాకులు మంజూరు చేసింది. కేవలం 10 నెలలు మాత్రమే కొనసాగిన వీరి దంపత్య జీవితం.. అధికారికంగా ముగిసింది. 2020 సంవత్సరంలో వీరిద్దరి వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అధికారికంగా విడాకులు తీసుకున్నారు.


 

చాలాకాలంగా విడాకుల వార్తల మధ్య వీరు ఇద్దరూ చర్చనీయాంశంగా మారారు. అయితే వీరిద్దరి విడాకులకు తాజాగా కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన తర్వాత ధనశ్రీ వర్మ – చాహల్ హర్యానాలో ఉండేవారు. చాహల్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండేవారు. కానీ ధనశ్రీ ముంబైకి తన నివాసాన్ని మార్చుకోవాలని భావించింది. ఈ విషయాన్ని చాహల్ తో చెప్పగా.. అందుకు చాహల్ నిరాకరించాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి రాలేనని తేల్చి చెప్పేశాడు.


దీంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని.. చివరకు అవే విడాకులకు కారణం అయ్యాయని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి యుజ్వేంద్ర చాహల్.. ఆర్జె మహ్వాష్ అనే రేడియో జాకీ తో హాజరయ్యాడు. తన భార్య ధనశ్రీ వర్మతో త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. వీరిద్దరూ జంటగా కనిపించడంతో అందరి కళ్ళు ఈ జంటపై పడ్డాయి.

ఇంతకీ ఈ ఆర్జె మహ్వాష్ ఎవరంటే.. ఈమె 1996లో ఉత్తరప్రదేశ్ లోని లో ఆలీఘర్ లో జన్మించారు. ఈమె ప్రత్యేక కంటెంట్ క్రియేటర్. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు, ఫన్నీ క్లిప్స్ కూడా చేస్తోంది. యూట్యూబ్ లో ఈమెకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈమె అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ జామియా మిలియా ఇస్లామియా పూర్తిచేసింది.

చదువులు పూర్తయిన తర్వాత రేడియో జాకీగా పనిచేస్తూ కెరియర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ “బిగ్ బాస్ 14” లో కూడా ఆఫర్ వచ్చిందట. కానీ దానిని రిజెక్ట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ఆర్జే మహ్వాష్.. కొన్ని బాలీవుడ్ ఆఫర్లను సైతం రిజెక్ట్ చేసిందని చెబుతారు. ఇక తాజాగా ఈమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. “అతడే నాకు అన్ని. నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో.. అతడే నాకు ఏకైక వ్యక్తి అవుతాడు.

 

నా జీవితం అతడి చుట్టూనే తిరుగుతుంది. నాకు అనవసరమైన వ్యక్తులు వద్దు. నాకు ఆ ఒక్కడు ఉంటే చాలు ” అని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ కి యుజ్వేంద్ర చాహాల్ లైక్ కొట్టాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈమె డేటింగ్ రూమర్స్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ” నేను సింగిల్. కానీ సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్ గా డేట్స్ కి వెళ్ళను. ప్రస్తుతం నేను పెళ్లి అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేసా” అంటూ సంచలన ప్రకటన చేసింది.

Tags

Related News

Gambhir-Harshit Rana: వాడు నా కొడుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు..కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర‌ పెట్టుకోండి!

Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే

IND vs WI: తగలరాని చోట తగిలిన బంతి..కుప్ప‌కూలిన కేఎల్ రాహుల్‌…10 అడుగులు ప‌రుగెత్తి

SLW vs NZW: నేడు శ్రీలంక‌తో న్యూజిలాండ్ మ్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్‌ పాయింట్ల ప‌ట్టిక ఇదే

Virat Kohli: ఆసీస్ టూర్ కు ముందు కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులు ఇవే…ఇక ప్రపంచంలోనే మొన‌గాడు కావ‌డం ప‌క్కా

SaW vs BanW: బంగ్లాపై ద‌క్షిణాఫ్రికా విజ‌యం…పాయింట్ల ప‌ట్టిక‌లో కింద‌కు ప‌డిపోయిన టీమిండియా

Rohit Sharma: సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్న రోహిత్‌..ధోనిలాగా 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల‌ని ప్లాన్ ?

Big Stories

×