Viral News : కొన్ని దృశ్యాలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు. కానీ, అవి నమ్మి తిరాల్సిందే. అలాంటి అరుదైన దృశ్యమే ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. భారత్‌లో షష్ఠగ్రహ కూటమి ఏర్పడే సమయంలో.. కెనడాలో ఆ అద్భుతం ఆవిష్కృతమైంది. అదేంటంటే…
సూర్యుడు.. డబుల్ యాక్షన్!
సూర్యుడు ఒక్కడే. గ్రహాలను తన చుట్టూ తిప్పుకునే రారాజు. కానీ, ఆ రోజు ఆకాశంలో ఇద్దరు సూర్యులు ఉదయించారు. అవును, మీరు చదివింది నిజమే. ఆ రోజు సుర్యోదయ సమయంలో.. నింగిలో రెండు సూర్యులు కనిపించారు. నదీ తీరపు అంచులను తాకుతూ.. ఒక సూర్యుడితో మరో సూర్యుడు పోటీపడుతూ.. పైపైకి ఉదయించారు. డబుల్ సన్‌రైజ్. డబుల్ మజా. చూసేవాళ్లలో సంభ్రమాశ్చర్యాలు. డౌట్ ఉంటే ఆ వీడియో మీరూ చేసేయండి…
Spectacular: The partially eclipsed Sun rising over the St Lawrence River in Quebec, captured on March 29. Video by Jason Kurth.
(I sped up the footage 4x for the impatient…like myself.)https://t.co/KUSX4RFbUW pic.twitter.com/7tMt02cfKr
— Corey S. Powell (@coreyspowell) April 2, 2025
చూశారుగా. అదీ మేటర్. నిజానికి ఒక్కడే సూర్యుడు. కాకపోతే రెండుగా కనిపించాడు. అలా భ్రమకు లోనయ్యేలా చేశాడు. ఈ మేజిక్ చేసింది సూర్యుడు కాదు. మనుషులే. అత్యంత నైపుణ్యం ఉన్న అన్వేషకుల బృందం ఈ గమ్మత్తును తమ కెమెరాల్లో బంధించాయి.
ఆకాశంలో ఈ అద్భుతం జరిగింది ఎక్కడంటే..
మార్చి 29. కెనడాలో పాక్షిక సూర్యగ్రహణం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్‌లో వచ్చిన అరుదైన సమయం. ఆ టైమ్‌కల్లా ఖగోళ అన్వేషకులు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు.. కెనడా దేశంలోని క్యూబెక్‌లోని సెయింట్ లారెన్స్ నది ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే కెవిన్ వుడ్, జాసన్ కుర్త్ అనే ఇద్దరి ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది ఈ రెండు సూర్యులు ఒకేసారి ఉదయిస్తున్నట్టు కనిపించే ఆప్టికల్ భ్రమ.
డబుల్ సన్‌రైజ్ ఎలా ఏర్పడిందంటే..
నదీ తీరంలో పాక్షిక సూర్య గ్రహణం. సూర్యుడికి అడ్డుగా చంద్రుడు ఉండటం.. ఆ చంద్రుడు కాస్త పైకి కదలగానే.. సూర్యుడి రెండు కొనలు.. రెండు సూర్యులుగా ఉదయిస్తు్న్నట్టు కనిపించింది. అదే సమయంలో సముద్రపు ఎండమావి, దానికి తోడుగా పొగమంచు కమ్ముకోవడం.. అన్నీ కలిసి ఆ దృశ్యాన్ని మరింత మనోహరంగా మార్చేశాయి. కాసేపటికి సూర్యుడు సైతం కాస్త పైకి లేచాడు. ఇద్దరు సూర్యులు భ్రమ తొలిగి.. చంద్రవంక ఆకారం ఆకర్షించింది. గ్రహణం ముగిసే సరికి అసలు సూర్యుడు ఎప్పటిలానే ప్రకాశించాడు.
Also Read : అలేఖ్య చిట్టి పచ్చళ్లు.. అసలేంటి గొడవ? కంప్లీట్ డీటైల్స్
అది అంత ఈజీ కాదమ్మా..
ఇలా జరగొచ్చు అని ఆ ఖగోళ ఔత్సాహిక బృందం ముందే ఊహించింది. అందుకోసం శ్రమతో సెయింట్ లారెన్స్ నదికి చేరుకున్నారు. అక్కడంతా కఠోర వాతావరణ పరిస్థితులు. మైనస్ 13 డిగ్రీల చలి. వాటికి తోడు విపరీతమైన గాలులు. అంతటి కష్టానికి ఓర్చి.. అత్యంత అరుదైన డబుల్ సన్‌రైజ్ ను తమ కెమెరాల్లో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే.. నిమిషాల్లో ట్రెండింగ్ అయ్యాయి. చూసిన వాళ్లంతా వావ్ అంటున్నారు. విస్తృంగా షేర్లు చేస్తున్నారు. వన్స్ ఇన్ లైఫ్‌టైమ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.