BigTV English

Sania Mirza | తండ్రి పాకిస్తానీ.. సానియా మీర్జా కొడుకు ఏ దేశ పౌరుడు?

Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయెబ్ మలిక్ నుంచి విడాకులు తీసుకుంది. షోయెబ్ మలిక్ కూడా పాకిస్తానీ నటి సనా జావేద్‌తో మూడో వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ భారతీయురాలైన సానియా మీర్జాకు, పాకిస్తానీ అయిన షోయెబ్ మలిక్‌కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు ఇజ్హాన్ మీర్జా మలిక్.

Sania Mirza | తండ్రి పాకిస్తానీ.. సానియా మీర్జా కొడుకు ఏ దేశ పౌరుడు?

Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయెబ్ మలిక్ నుంచి విడాకులు తీసుకుంది. షోయెబ్ మలిక్ కూడా పాకిస్తానీ నటి సనా జావేద్‌తో మూడో వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ భారతీయురాలైన సానియా మీర్జాకు, పాకిస్తానీ అయిన షోయెబ్ మలిక్‌కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు ఇజ్హాన్ మీర్జా మలిక్.


2010లో సానియా మీర్జా, షోయెబ్ అఖ్తర్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. అయితే షోయెబ్ తన స్వదేశం పాకిస్తాన్‌లోనే ఉండేవాడు. సానియా మీర్జా కూడా హైదరాబాద్‌లో నివాసముండేది. వీరిద్దరూ దుబాయ్‌లో ఒక ఇల్లు కొని అప్పుడప్పుడూ అక్కడే కాపురం చేసేవారు. వీరిద్దరికీ 2018లో కొడుకు పుట్టాడు.

ఆ సమయంలో తన కొడుకు ఇజ్హాన్‌కు పాకిస్తానీ పౌరసత్వం కానీ భారత పౌరసత్వం కానీ వద్దనీ షోయెబ్ మలిక్ దుబాయ్‌లోనే తన కుటుంబంతో ఉండేవాడు. అయితే దుబాయ్‌లో తల్లిదండ్రులకు గోల్డెన్ వీజా ఉండడంతో ఆ పిల్లాడికి ఇప్పటికి వరకు పౌరసత్వం విషయంలో ఏ ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతానికి ఇజ్హాన్‌కు యుఎఈ(దుబాయ్)లో టెంపరరీ పౌరసత్వం ఉంది.


కానీ ఇప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో ఇజ్హాన్ ఏ దేశ పౌరుడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. పాకిస్తాన్‌లో చట్టప్రకారం రెండు దేశాల పౌరసత్వం ఒకేసారి తీసుకోవచ్చు. అంటే ఎవరైనా పాకిస్తానీ పౌరుడు కెనెడా, యుకె, అమెరికా లాంటి దేశ పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. కానీ భారతదేశంలో ఇది చట్ట వ్యతిరేకం.

భారతీయులు ఎవరైనా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం రద్దు అవుతుంది. భారతీయుల వద్ద ఒకేసారి రెండు పాస్‌పోర్ట్‌లు ఉంటే అది చట్ట రీత్యా నేరం. పైగా పాకిస్తాన్ దేశంలో కూడా మరే దేశం పౌరసత్వం తీసుకున్నా ఓకే కానీ భారత్ పౌరసత్వం కుదరుదు.

విదేశాలలో నివసించే భారతీయులకు పిల్లలు పుట్టిన సమయంలోనే అక్కడి భారత ఎంబసీలో పుట్టిన బిడ్డ గురించి సమాచారం ఇవ్వాలి. అక్కడే అతను పుట్టినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ తరువాత ఆ పిల్లాడికి భారత పాస్‌పోర్టు(పౌరసత్వం) లభిస్తుంది.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×