E-Paper
Advertisement

Tollywood: అయోధ్య స్పెషల్.. ఎన్ని సినిమాలు అనౌన్స్ చేశారో తెలుసా?

Tollywood: అయోధ్య స్పెషల్.. ఎన్ని సినిమాలు అనౌన్స్ చేశారో తెలుసా?

Tollywood: జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు దేశ ప్రధాన మంత్రి సహా సెలబ్రెటీలు అయోధ్యలో సందడి చేశారు. అయితే ఇదే రోజును చాలామంది స్పెషల్ డేగా జరుపుకున్నారు. కొందరైతే తమకు పుట్టబోయే బిడ్డను ఇదే రోజున ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు.. ఈ స్పెషల్ డే రోజున టాలీవుడ్‌లో చాలా కొత్త సినిమాలను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏకంగా ఒక్క టాలీవుడ్ నుంచే పది సినిమాలు అనౌన్స్ చేయడం గమనర్హం.

జై హనుమాన్..

క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ టైటిల్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సీక్వెల్ మూవీని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

శ్రీ రామ్ జై హనుమాన్..

కొత్త దర్శకుడు అవదూత డైరెక్షన్‌లో ‘శ్రీ రామ్ జై హనుమాన్’ మూవీని అనౌన్స్ చేశారు. కె.ఏ. సురేష్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. కేవలం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మాత్రమే మేకర్స్ వదిలారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

రామం రాఘవం..

విలక్షణ నటుడు సముద్రఖని, టాలీవుడ్ కమెడియన్ ధనరాజ్ ప్రధాన పాత్రల్లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం’. ఈ సినిమాకు పృథ్వీ పోలవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

అలా చేరే సీత రాముని చెంతకు..

జ్ఞానీ వాసుదేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కౌశిక్ ఘంటసాల హీరోగా నటిస్తున్నాడు. ఆదియోగి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో జి.శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది.

అలనాటి రామ చంద్రుడు..

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘అలనాటి రామ చంద్రుడు’. ఈ సినిమాలో కృష్ణ వంశి, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌లో శ్రీ రామ్ జడపోలు నిర్మిస్తున్నారు.

అజాగ్రత్త..

ఎం. శశిధర్ దర్శకత్వంలో కన్నడ నటి రాధిక కుమార్ స్వామి మెయిన్ లీడ్‌గా నటిస్తున్న సినిమా ‘అజాగ్రత్త’. ఈ సినిమాను శ్రేయాస్ తల్పడే నిర్మిస్తున్నారు.

జై గణేష్..

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై గణేష్’. ఏప్రిల్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

కూర్మ నాయకి..

నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘కూర్మ నాయకి’. ఈ సినిమాను కొత్త దర్శకుడు హర్ష వర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి తన కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్‌లో నటిస్తుంది.

A మాస్టర్ పీస్ ..

కొత్త దర్శకుడు సుకు పూర్వజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అతనితోపాటు ఈ సినిమాలో అందరూ కొత్త నటీ, నటులే నటిస్తున్నారు.

అరి..

విజయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య పురిమేట్ల హీరోగా పరిచయమవుతున్నాడు. ఆక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ అవుతుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×