Vastu Tips for House: హిందూ సంప్రదాయంలో ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సింహద్వారాన్ని కేవలం రాకపోకలు సాగించే మార్గంగానే కాకుండా.. సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉండే స్థానంగా భావిస్తాం. ఇంటి లోపలికి సానుకూల శక్తి ప్రవేశించాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉండాలి. ముఖ్యంగా మెయిన్ డోర్ వద్ద ఏ రకమైన ఫొటోలు ఉండాలి. ఏవి ఉండకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి అదృష్టానికి రాజమార్గం:
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి మెయిన్ డోర్ చాలా ముఖ్యం. అందుకే పూర్వ కాలం నుంచి మెయిన్ డోర్ సింహద్వారాన్ని మామిడి ఆకులు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తుంటారు. నేటి కాలంలో చాలా మంది ఇంటి అందం కోసం రకరకాల ఫోటోలను మెయిన్ డోర్ వద్ద తగిలిస్తున్నారు. అయితే.. తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు.
సింహద్వారం వద్ద ఉండాల్సిన శుభప్రదమైన ఫోటోలు:
గణపతి ఫోటో: చాలా మంది ఇంటి బయట గణేశుడి విగ్రహం లేదా ఫోటో పెడుతుంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. గణపతిని కేవలం బయట మాత్రమే పెడితే.. ఆయన వెనక భాగం (దరిద్రం అని భావిస్తారు) ఇంటి వైపు చూస్తున్నట్లు అవుతుంది. కాబట్టి.. బయట గణపతిని పెట్టినప్పుడు సరిగ్గా అదే గోడకు లోపలి వైపు కూడా మరో గణపతిని పెట్టాలి. దీనిని “పృష్ఠ భాగ దోషం” తొలగించడం అంటారు.
స్వస్తిక్ , ఓం చిహ్నాలు: స్వస్తిక్ గుర్తు విజయానికి, శుభానికి సంకేతం. ప్రధాన ద్వారానికి పైన లేదా ఇరు వైపులా సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేయడం లేదా ఫోటోలు ఉంచడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి.
కలశం: నిండు కలశం ఫోటో లేదా చిహ్నం సంపదకు చిహ్నం. ఇది ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువస్తుంది.
లక్ష్మీ పాదాలు: ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా ఉండే.. లక్ష్మీ దేవి పాదాల స్టిక్కర్లు లేదా ఫోటోలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి.
ఎలాంటి ఫోటోలు అస్సలు ఉండకూడదు?
చాలా మంది స్టైల్ కోసం లేదా భక్తితో కొన్ని ఫోటోలు పెడతారు. కానీ అవి వాస్తు ప్రకారం మాత్రం చాలా ప్రతికూలతను కలిగిస్తాయి.
యుద్ధం లేదా హింస: మహాభారత యుద్ధానికి సంబంధించిన ఫోటోలు అంతే కాకుండా.. వేటాడుతున్న జంతువులు లేదా ఆయుధాలకు సంబంధించిన ఫోటోలు సింహద్వారం వద్ద అస్సలు ఉండకూడదు. ఇవి ఇంట్లో గొడవలకు దారి తీస్తాయి.
నీటికి సంబంధించిన ఫోటోలు: ప్రవహించే నీరు లేదా జలపాతాలకు సంబంధించిన ఫోటోలు మెయిన్ డోర్ దగ్గర పెట్టకూడదు. వాస్తు ప్రకారం.. ఇది డబ్బు నిలవకుండా ఖర్చైపోవడానికి సంకేతం.
వాడిపోయిన పూలు/చెట్లు: ఎండిపోయినట్లు ఉండే మొక్కల ఫోటోలు లేదా ముళ్ల చెట్ల ఫోటోలు నిరాశను కలిగిస్తాయి.
వద్దే వద్దు ఈ విగ్రహాలు: మెయిన్ డోర్ ఎదురుగా నటరాజ విగ్రహం లేదా తాండవం చేస్తున్న శివుడి ఫోటోలు ఉంచకూడదు.
Also Read: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
ముఖ్యమైన వాస్తు చిట్కాలు:
వెలుతురు: మెయిన్ డోర్ ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. అక్కడ ఒక ప్రకాశవంతమైన బల్బ్ ఉండేలా చూసుకోండి. వెలుగు ఉన్న చోట లక్ష్మీ దేవి నివసిస్తుంది.
ముగ్గు: ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు.
డస్ట్ బిన్: ప్రధాన ద్వారం పక్కన చెత్త బుట్టలు, పాత సామాన్లు, విరిగిన కుర్చీలు అస్సలు ఉంచకండి. ఇది రాహు దోషాన్ని పెంచుతుంది.
గడప: మెయిన్ డోర్‌కి గడప తప్పనిసరి. గడప లేని ఇల్లు రక్షణ లేని కోట లాంటిది. దానికి రోజూ పసుపు రాస్తే చాలా మంచిది.
ఇంటి ప్రధాన ద్వారం కేవలం ఒక తలుపు మాత్రమే కాదు. అది మీ జీవితంలోకి వచ్చే అవకాశాలకు మార్గం. పైన చెప్పిన విధంగా చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీరు మీ ఇంట్లో ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు.