Shoaib Akhtar: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన పైన షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ గా షాన్ మసూద్ ను (Shan masood) నియామకం చేసి పాకిస్తాన్ క్రికెట్ పెద్ద తప్పిదం చేసిందని మండిపడ్డారు. కెప్టెన్ గా అతడు అనర్హుడని బాంబు పేల్చారు. ఇంగ్లీష్ వస్తుందన్న ఒక్క కారణంతో షాన్ మసూద్ కు కెప్టెన్సీ ఇచ్చారని చురకలు అంటించారు.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ జట్ల మధ్య ఈనెల 8వ తేదీన మొదటి టెస్ట్ జరిగింది. ఇందులో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ చేతులు ఏకంగా 104 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు టెస్ట్ క్రికెట్ కు ఏ మాత్రం షాన్ మసూద్ సరిపోడని బాంబు పేల్చారు.
అయినప్పటికీ షాన్ మసూద్ కు కెప్టెన్సీ ఇచ్చి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద తప్పిదం చేసిందని మండిపడ్డారు. ఇంగ్లీష్ మాట్లాడడం పాకిస్తాన్ జట్టులో ఎవరికి రాదని… అందుకే షాన్ మసూద్ ముఖానికి కెప్టెన్సీ వచ్చిందన్నారు. లేకపోతే వాడు దేనికి పనికిరాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలియక షాన్ మసూద్ పెద్ద ఆటగాడని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు భ్రమ పడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. బాబర్ ఆజం లాంటి ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలన్నారు. బాబర్ కు కెప్టెన్సీ ఇచ్చిన పర్లేదని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్, షాహిన్ అఫ్రిది మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ మధ్యలోకి వెళ్లాడట. దీంతో ఆ ఇద్దరు కలిసి రిజ్వాన్ పై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో రిజ్వాన్ కు తీవ్ర గాయాలైనట్లు కూడా సమాచారం.
https://www.facebook.com/photo/?fbid=3327853947375326&set=a.2580868458740549