E-Paper
Advertisement

Smriti Mandhana: స్పోర్ట్స్ ఏజెన్సీతో స్మృతి మందాన భారీ డీల్..

Smriti Mandhana: స్పోర్ట్స్ ఏజెన్సీతో స్మృతి మందాన భారీ డీల్..
Advertisement
Smriti Mandhana: స్పోర్ట్స్ ఏజెన్సీతో స్మృతి మందాన భారీ డీల్..

Smriti Mandhana: క్రికెట్ అంటే ఒక ఎమోషన్ అని అంటుంటారు. కానీ అందులో కూడా ఎమోషన్ విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి. మెన్ క్రికెట్ టీమ్ లాగానే ఉమెన్ క్రికెట్ టీమ్ కూడా ప్రారంభమయ్యింది. కానీ మెన్ క్రికెట్ టీమ్‌కు వచ్చిన పాపులారిటీ, క్రేజ్.. ఉమెన్ టీమ్‌కు రావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు చాలావరకు రెండు టీమ్స్‌ను సమానంగా చూడడం ప్రారంభించారు ప్రేక్షకులు. అందుకే స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీలు కూడా క్రికెటర్స్‌ను సమానంగా చూస్తూ కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు.

ఉమెన్ క్రికెటర్లలో కూడా కొందరికి విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందులో ఒకరు స్మృతి మందాన. అందంతో పాటు టాలెంట్ ఉన్న క్రికెటర్‌గా స్మృతి ఫ్యాన్‌బేస్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఈ క్రికెటర్‌తో స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిన బేస్‌లైన్ వెంచర్స్.. పలు సంవత్సరాల వరకు కాంటాక్ట్ చేసుకుంది. బేస్‌లైన్ వెంచర్స్ అనేది ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ. స్మృతి ముందుగా 2017లో ఈ ఏజెన్సీలో జాయిన్ అయ్యింది. ఇప్పుడు దీంతోనే కాంట్రాక్ట్ చేసుకునే స్థాయికి చేరుకుంది అని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

ఈ డీల్ ద్వారా పలు సంవత్సరాల పాటు బేస్‌లైన్ వెంచర్స్.. స్మృతి మందానను బ్రాండ్ ఐకాన్‌గా చూపిస్తుంది. ఈ ఏజెన్సీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం సంతోషం ఉందని స్మృతి బయటపెట్టింది. తను బేస్‌లైన్‌లో జాయిన్ అయ్యిందని తెలియగానే ఎండోర్స్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్, బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే బేస్‌లైన్ వెంచర్స్.. మందాన కోసం పలు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్‌ను సిద్ధం చేసి పెట్టింది. హీరో మోటోకార్ప్, రెడ్ బుల్, నైక్, గల్ఫ్ ఆయిల్, రాంగ్లర్, హ్యుండాయ్, లీలా హోటల్స్.. ఇలా దాదాపు 15కు పైగా కంపెనీలకు స్మృతి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

ఆన్ పిచ్‌లో ఆటతో అదరగొట్టే స్మృతిని ఆఫ్ పిచ్ ప్రేక్షకులకు దగ్గర చేయనుంది ఈ బేస్‌లైన్ వెంచర్స్. అంతే కాకుండా ఈ ఏజెన్సీ ద్వారా మరికొందరు అథ్లెట్స్‌ను క్రికెటర్లుగా మార్చాలని స్మృతి నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా ప్రపంచంలోని 10 ఫేమస్ ఫీమేల్ అథ్లెట్స్ లిస్ట్‌లో ఒకటిగా స్మృతి పేరు దక్కించుకుంది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్నవారిలో ఒకరిగా కూడా చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న 10 ఫీమేల్ అథ్లెట్స్ లిస్ట్‌లో ఒక ఇండియన్ ఉండడం ఇదే మొదటిసారి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×