Big Stories

SA Vs BAN Highlights: దక్షిణాఫ్రికా ‘మహరాజ్’.. బంగ్లాదేశ్ పై గెలిపించిన మనవాడు..!

T20 World Cup 2024 – South Africa Vs Bangladesh Highlights: ప్రపంచక్రికెట్ లో ప్రవాస భారతీయులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ వేసి.. యూఎస్ఏ ను.. మన సౌరభ్ నేత్రావల్కర్ గెలిపించాడు. అది మరువకముందే తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వేసి దక్షిణాఫ్రికాను కేశవ్ మహరాజ్ గెలిపించాడు.

- Advertisement -

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన న్యూయార్క్ లోనే బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగింది. ఇక్కడ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఇండియా కనీసం 119 పరుగులు చేసి, మ్యాచ్ గెలిస్తే.. సౌతాఫ్రికా 113 పరుగులే చేసి గట్టెక్కింది.

- Advertisement -

టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓటమి v పాలైంది.

వివరాల్లోకి వెళితే.. 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ త్వరత్వరగా ఓపెనర్లను కోల్పోయింది. తాజిద్ హాసన్ (9), కెప్టెన్ షాంతో (14) అయిపోయారు. తర్వాత వచ్చిన లిటన్ దాస్ (9), షకీబ్ (3) వీళ్లు తక్కువ స్కోరుకే అయిపోయారు. అప్పటికి 9.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 50 పరుగులతో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

Also Read: IND vs USA T20WC Match Preview: గెలిస్తే.. సూపర్ 8.. నేడే అమెరికా వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్

ఈ దశలో తౌహిద్ హ్రదయ్ (37), మహ్మదుల్లా (20) ఆదుకున్నట్టే కనిపించారు.  కానీ మ్యాచ్ ని గెలిపించలేకపోయారు. చివరి ఓవర్ లో 11 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు మన ప్రవాస భారతీయుడు కేశవ్ మహరాజ్ వచ్చాడు. నిజానికి ఆఖరి ఓవర్ స్పిన్నర్ కి ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కెప్టెన్ మార్క్రమ్ నమ్మకాన్ని మహరాజ్ నిలబెట్టాడు.

చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 5వ బంతిని మహ్మదుల్లా చాలా బలంగా కొట్టాడు. అది గాల్లోకి చాలా ఎత్తుకి లేచింది. స్టేడియం అవతల పడుతుందని అంతా అనుకున్నారు. కానీ లాంగ్ ఆన్ లో కెప్టెన్ మార్క్రమ్ అద్భుతంగా పట్టేశాడు.

దాంతో ఆఖరి బాల్ కి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 2 పరుగులే రావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 109 పరుగుల వద్ద ఆగిపోయింది.

Also Read: టీమ్ ఇండియా.. ఓ చెత్త రికార్డ్

దక్షిణాఫ్రికా బౌలింగులో కేశవ్ మహరాజ్ 3, రబడా 2, అన్రిచ్ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికాకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సీనియర్ అయిన క్వింటన్ డికాక్ (18) తను వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్ పై ఆశలు పెట్టుకుంటే తను 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత స్టబ్స్ కూడా డక్ అవుట్ అయ్యాడు. 4.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 23 పరుగులతో దక్షిణాఫ్రికా పరిస్థితి ఘోరంగా తయారైంది.

అప్పుడు ఆపద్బాంధవుడిలా క్లాసిన్ వచ్చాడు. 44 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. తనకి సపోర్టుగా డేవిడ్ మిల్లర్ (29) కాసేపు నిలిచాడు. అందువల్ల దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరు అయినా సాధించింది. మొత్తానికి పడుతూ లేస్తూ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ బౌలింగులో సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2, రిషద్ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News