OTT Movie : కొన్ని యానిమేషన్ సినిమాలు సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. చిన్న సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే, అంచనాలు మారిపోతుంటాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక యానిమేటెడ్ మూవీ 236 మిలియన్ వ్యూస్ తో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్-లాంగ్వేజ్ చిత్రంగా నిలిచింది. దాని యానిమేషన్, సంగీతం, కామెడీ కోసం ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. సౌండ్‌ట్రాక్ బిల్‌బోర్డ్ హాట్ 100లో ఏడు ట్రాక్‌లతో, “గోల్డెన్” నంబర్ 1 స్థానంలో నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ దీనిని “చార్మింగ్, ఫన్నీ, ఆర్ట్‌ఫుల్‌గా పంచీ” గా వర్ణించింది. ‘గోల్డెన్’ ‘యువర్ ఐడల్’ వంటి పాటలు బిల్‌బోర్డ్ హాట్ 100లో టాప్ 10లో చోటు సంపాదించాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్ లో
‘KPop Demon Hunters’ 2025లో విడుదలైన అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం. సోనీ పిక్చర్స్ యానిమేషన్ నిర్మించిన , నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా మాగీ కాంగ్, క్రిస్ అప్పెల్‌హాన్స్ దర్శకత్వంలో రూపొందింది. ఈసినిమాకి ఆర్డెన్ చో, అహ్న్ హ్యో-సియోప్, మే హాంగ్, జి-యంగ్ యూ, యున్జిన్ కిమ్, డానియల్ డే కిమ్, కెన్ జియోంగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా 2025 జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, రాటెన్ టొమాటోస్‌లో 96% స్కోర్, IMDbలో 7.7/10 రేటింగ్ సాధించింది.
స్టోరీలోకి వెళ్తే
చాలా కాలం క్రితం, డెమన్స్ మనుషుల ఆత్మలను తమ రాజు గ్వి-మా కోసం దోచుకునేవాళ్ళు. ఆతరువాత ముగ్గురు మహిళలు డెమన్ హంటర్స్‌గా మారి, హన్‌మూన్ అనే మాయా బ్యారియర్‌తో డెమన్స్‌ను సీల్ చేస్తారు. ఈ లెగసీ తరతరాలుగా కొనసాగింది. ప్రతి జనరేషన్ తమ పాటలతో హన్‌మూన్‌ను బలోపేతం చేస్తూ, చివరికి గోల్డెన్ హన్‌మూన్‌గా మార్చి డెమన్స్‌ను శాశ్వతంగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇప్పుడు రూమీ, మీరా, జోయి లేటెస్ట్ డెమన్ హంటర్స్.
రూమీ సైంగెమ్ స్వోర్డ్‌తో, మీరా గోక్‌డో పోల్‌ఆర్మ్‌తో, జోయి షింకల్ త్రోయింగ్ నైవ్స్‌తో డెమన్స్‌తో పోరాడుతారు. ఒకరోజు రూమీకి తన తల్లి వల్ల డెమన్ లక్షణాలు వస్తాయి. దీనివల్ల ఆమె తన గొంతును కోల్పోతుంది. రూమీ తన డెమన్ మార్క్స్‌ను దాచుకుంటూ ముందుకు వెళ్తుంది. గోల్డెన్ హన్‌మూన్ ఆమె డెమన్ లక్షణాలను తొలగిస్తుందని నమ్ముతుంది. ఒక వరల్డ్ టూర్ తర్వాత, వీళ్లంతా “గోల్డెన్” సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధపడతారు. కానీ రూమీ గొంతు కోల్పోవడంతో సమస్య మొదలవుతుంది.
మరోవైపు డెమన్ కింగ్ గ్వి-మా, మరిన్ని ఆత్మల కోసం ఆరాటపడుతూ, జినూ అనే డెమన్‌ను భూమిపైకి పంపిస్తాడు. జినూ ఒకప్పుడు మనిషి. తన తల్లి, సోదరిని పేదరికం నుండి బయటపడేయడానికి గ్వి-మాకు తన ఆత్మను సమర్పించుకున్నాడు. కానీ అతని కుటుంబం ఇప్పటికీ బాధల్లోనే ఉంటుంది. జినూ ఆత్మలను దోచుకుని హన్‌మూన్‌ను బలహీనపరచాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకు గాను సాజా బాయ్స్ పాప్ సింగర్స్ సాంగ్స్‌తో హన్‌మూన్ ఫ్యాన్స్‌ను తన వైపు తిప్పుకుంటాడు. దీనివల్ల హన్‌మూన్ ఇప్పుడు బలహీనపడటం మొదలవుతుంది.
రూమీ జినూతో ఒక సారి కలసినపప్పుడు అతని గతం గురించి తెలుసుకుంటుంది. ఆమె అతనికి సహాయపడాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో మీరా, రూమీ డెమన్ లక్షణాలను గుర్తించి, ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ వీళ్లంతా కలిసి సాజా బాయ్స్‌ను ఎదుర్కోవడానికి ఒక రివెంజ్ సాంగ్ “టేక్‌డౌన్”ను రూపొందిస్తారు. ఇది హన్‌మూన్‌ను బలోపేతం చేస్తుంది. చివరి యుద్ధంలో, సియోల్ ఒలింపిక్ స్టేడియంలో హంటర్స్ , సాజా బాయ్స్ మధ్య ఒక భారీ కాన్సర్ట్-కమ్-బ్యాటిల్ జరుగుతుంది. ఇక ఈ క్లైమాక్స్ కూడా ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. చివరికి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ? డెమన్ కింగ్ ను శాస్వతంగా బంధిస్తారా ? రూమీకి డెమన్ లక్షణాలు పోతాయా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : ఓటీటీలో బ్యాన్ అయిన మూవీ… వీక్ హర్టెడ్ పీపుల్ చూడకూడని హర్రర్ స్టోరీ.. సర్ప్రైజింగ్ కాన్సెప్ట్