Mark Wood : ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ వుడ్ గురించి9 దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. టీమిండియా క్రికెట్ అభిమానులందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. క్రికెట్ లో ఒక దేశం తరపున క్రికెట్ ఆడుతున్నారంటే వాళ్ల గురించి ఇతర దేశాలకు చెందిన క్రికెటర్ల గురించి తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో వుడ్ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలుచేశాడు. తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతులను బౌండరీలకు తరలిస్తారు. అతని ఆటను చూస్తే.. బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కి కి కూడా బౌలింగ్ చేయడం సవాలే అని.. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.