RCB Sarees : ఐపీఎల్ 2025 ట్రోఫీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడైతే విజయం సాధించిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. దాదాపు 17 సంవత్సరాల తరువాత మొదటి సారి ట్రోఫీ సాధించిన సంతోషం కూడా లేకుండా నిత్యం ట్రోలింగ్స్ చేయడంతో ఆర్సీబీ క్రీడాకారులు, యజమాన్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాాజాగా ఉమెన్స్ చీరలపై ఆర్సీబీ కప్ కి సంబంధించిన ఇమేజేజ్ పెట్టి ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆర్సీబీ అభిమానుల పనా..? లేక వ్యతిరేకుల పనా..? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆర్సీబీ సిల్క్ చీర అని.. ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ నినాదాలు చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?
వారే ఆర్సీబీని ట్రోలింగ్స్ చేస్తున్నారా..?
మరోవైపు వినాయక చవితికి సంబంధించి కూడా ఓ గణేషుడికి ఆర్సీబీ ట్రోఫీ ధరించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆర్సీబీ ట్రోఫీ ఫొటో చూడగానే కొంత మంది ట్రోలింగ్స్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు చూస్తున్నారు. ఈ సారి చీరలకు సంబంధించి ఆర్సీబీ పేరుచూసి.. ఆర్సీబీ క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీలు ఎక్కడ అంటూ మళ్లీ ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ఐపీఎల్ 2025 టైటిల్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయం సాధించిన తరువాత బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది ఆర్సీబీ. అయితే ఆ సమయంలో చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ 17 సంవత్సరాల ట్రోఫీ సాధించడంతో అభిమానులు సంతోషం ఆపుకోలేక విజయోత్సవాలు జరుపుకునేందుకు లక్షలాది మంది చిన్న స్వామి స్టేడియం వద్దకు వచ్చారు. దీంతో అక్కడ గుమికూడటం.. జనాభా ఎక్కువ కావడంతో పోలీసులకు కంట్రోల్ కాక తొక్కిసలాట జరిగి విషాద సంఘటన చోటు చేసుకుంది.
చీరలపై ఆర్సీబీ ఏంట్రా.. బాబు
వాస్తవానికి అక్కడికీ లక్షలాది మంది రావడంతో జనాలను కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో అదుపులేకపోవడం.. స్టేడియం వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ లక్షలాది మందిని నియంత్రించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తొక్కిసలాట జరిగి విషాద ఘటన మిగిల్చింది. ఈ విషాద ఘటన తరువాత ఆర్సీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్సీబీ మద్దతు దారులు అంతా సురక్షితంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లు ఎక్కడ కనిపించినా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలాగే ఆర్సీబీ ట్రోఫీని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి ఘోరంగా ట్రోలింగ్స్ చేయడంతో అభిమానులు కొందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీని కావాలని ట్రోలింగ్స్ చేస్తున్నారా..? లేక మరేదైనా అని రకరకాలుగా చర్చించుకోవడం విశేషం. చీరలపై కూడా ఆర్సీబీ ఏంట్రా బాబు అని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.
?igsh=MW1wZXNnejd6cmY2bQ==