Rinku Singh’s Wedding : టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ ఆసియా కప్ 2025కి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఇతను చెప్పుకోదగిన ప్రదర్శనలు చేయనప్పటికీ ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్నాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్. రింకూ సింగ్ ను నిన్న మొన్నటి వరకు కొందరూ టార్గెట్ చేసుకొని మరీ విమర్శించారు. అయితే ఇక ఉత్తరప్రదేశ్ టీ-20 లీగ్ ప్రారంభం కాగానే వారి స్వరం మారిపోయింది. ఈ టోర్నీలో రింకూ సింగ్ బ్యాటర్ గానే కాకుండా బౌలర్ గానే రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లో యథాతథంగా మెరుపులు మెరిపిస్తూనే.. స్పిన్ బౌలింగ్ లో మాయా జాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇకపై తాను కేవలం ఫినిషనర్ ను మాత్రమే కాదు.. బ్యాటింగ్ ఆల్ రౌండర్ ని సంకేతాలు పంపాడు. ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Ravichandran Ashwin : అశ్విన్ రిటైర్మెంట్… CSKకు 10 కోట్ల లాభం… రంగంలోకి కాటేరమ్మ కొడుకు?
రింకుసింగ్ పెళ్లికి షారూఖ్ ఖాన్..
రింకూ సింగ్ ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ లో రింకూ సింగ్ మ్యారేజ్ జరుగనుంది. అయితే రింకూ సింగ్ పెళ్లికి కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ స్పెషల్ గెస్ట్ వస్తున్నాడని సమాచారం. వాస్తవానికి టీమిండియా క్రికెటర్ రింకూసింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ల ఎంగేజ్ మెంట్ లక్నోలో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. జూన్ 08, 2025న లక్నోలో ది సెంట్రమ్ అనే5 స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థానికి పలువురు క్రికెట్, రాజకీయాల ప్రముఖులు, కుటుంబ సభ్యలు హాజరయ్యారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ తెలుపు, గులాబీ రంగుల దుస్తులతో మెరిసిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా మెరుపు ప్రదర్శన చేసి ఆసియా కప్ కి ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
రింకూ సింగ్ ఇన్నింగ్స్ అదుర్స్..
లక్నో ఫాల్కన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్ చేయడానికి సహాయపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తరువాత రింకూ కాన్ణిడెన్స్ మరింత పెరిగినట్టు కనిపించింది. ఇక ఇదే ఫామ్ ను ఆసియా కప్ లో కొనసాగిస్తే.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్ ముందు చాలా మంది రింకూ సింగ్ జట్టులో అవసరమా..? అని ప్రశ్నించారు. అతనికి బదులు శ్రేయస్ అయ్యర్ లేక బ్యాటింగ్ ఆల్ రౌండర్ లో ఒకరినీ తీసుకోవాల్సిం ది అని చర్చించుకున్నారు. తనపై చర్చలు అనవసరం అని తాజాగా ప్రదర్శనలతో రింకూ నిరూపించాడు. కేవలం విధ్వంసక బ్యాటర్ గా, ఫినిషర్ గా మాత్రమే కాకుండా బౌలింగ్ లో కూడా రాణించగలనని సంకేతాలు పంపాడు. ఈ టోర్నీలో రింకూ కి 10 కి పైగా ఓవర్లువేసి బౌలర్ గాను మంచి మార్కులే కొట్టాడు. ఒక మ్యాచ్ లో అతను తీసిన వికెట్ హైలెట్ గా నిలిచింది.